NEET PG 2024 Exam Date: నీట్ పీజీ 2024 కొత్త పరీక్ష తేదీ వచ్చేసింది.. పరీక్షకు 2 గంటల ముందు క్వశ్చన్ పేపర్ తయారీ
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక మెడికల్ విద్యా సంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే నీట్-పీజీ పరీక్షను NBE వాయిదే వేసిన సంగతి తెలిసిందే. జూన్ 23న ఈ పరీక్ష జరగవల్సి ఉండగా.. పరీక్షకు కొన్ని గంటల ముందు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ చేసింది. నీట్ యూజీ 2024, యూజీసీ నెట్ 2024 పరీక్షల పేపర్ లీకేజీల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో..
న్యూఢిల్లీ, జులై 5: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక మెడికల్ విద్యా సంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే నీట్-పీజీ పరీక్షను NBE వాయిదే వేసిన సంగతి తెలిసిందే. జూన్ 23న ఈ పరీక్ష జరగవల్సి ఉండగా.. పరీక్షకు కొన్ని గంటల ముందు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ చేసింది. నీట్ యూజీ 2024, యూజీసీ నెట్ 2024 పరీక్షల పేపర్ లీకేజీల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తెల్పింది. అయితే తాజాగా నీట్ పీజీ పరీక్ష కొత్త తేదీలను NBE ప్రకటించింది. 2024-25 విద్యాసంవత్సరానికి పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 11న పరీక్ష నిర్వహించనున్నట్లు శుక్రవారం (జులై 5) ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 11న పరీక్ష నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్ణయించింది. మొత్తం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష జరుగుతుంది. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్ష నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేసింది. నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసిన రెండు వారాల తర్వాత కొత్త తేదీలను వెల్లడించింది.
ఈ మేరకు రివైజ్డ్ షెడ్యూల్‌ను ప్రకటించారు. గత ఏడేళ్లుగా నీట్ పీజీ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు పేపర్ లీకేజీ ఆరోపణలు రాలేదు. అయితే, నీట్-యూజీ 2024 పరీక్షపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు సంచలనంగా మారిన నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీట్ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. ఈసారి నీట్ పీజీ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించబోతున్నారు. నీట్-పీజీ పరీక్షకి కేవలం 2 గంటల ముందు మాత్రమే ప్రశ్నపత్రాన్ని తయారు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అంటే సరిగ్గా పరీక్ష రోజున.. పరీక్ష ప్రారంభానికి రెండు గంటల ముందు మాత్రమే సంబంధిత పరీక్ష కేంద్రాలకు క్వశ్చాన్ పేపర్లు పంపించాలని కేంద్రం నిర్ణయించింది.
NEET PG 2024 will be conducted on 11th August in two shifts pic.twitter.com/y2nAvDurPD
— ANI (@ANI) July 5, 2024
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో చేరేందుకు MBBS డిగ్రీ అర్హత కలిగిన వారికి NEET-PG నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.