AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET PG 2024 cut-off Marks: నీట్‌ పీజీ కనీస అర్హత మార్కులు మళ్లీ తగ్గాయ్‌.. కౌన్సెలింగ్‌లో వారందరికీ ఛాన్స్‌!

నీట్‌-పీజీ 2024 కనీస అర్హత మార్కులను మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ ఎంసీసీ మరోసారి భారీగా తగ్గించింది. దీంతో అన్ని కేటగిరీల్లో కనీసం 5 శాతం మార్కులు సాధించినవారికి కూడా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం దక్కింది. నీట్‌ పీజీ మెడికల్ సీట్లలో ప్రవేశాలకు గతేడాది ఏకంగా సున్నా మార్కులకు అర్హత శాతం తగ్గించిన సంగతి తెలిసిందే..

NEET PG 2024 cut-off Marks: నీట్‌ పీజీ కనీస అర్హత మార్కులు మళ్లీ తగ్గాయ్‌.. కౌన్సెలింగ్‌లో వారందరికీ ఛాన్స్‌!
NEET PG 2024 cut-off Marks
Srilakshmi C
|

Updated on: Feb 27, 2025 | 6:19 AM

Share

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ – పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ (నీట్‌-పీజీ) కనీస అర్హత మార్కులను మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) మరోసారి తగ్గించింది. దీంతో అన్ని కేటగిరీల్లో కనీసం 5 శాతం మార్కులు సాధించినవారికి కూడా కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకాశం కల్పించింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాలను అనుసరించి సవరించిన అర్హత శాతం మార్కులు జనరల్, EWS, UR-PwBD, SC, ST, OBC, PwBDతో సహా అందరు అభ్యర్థులకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే ఆగస్టు 23, 2024న జారీ చేసిన నీట్‌-పీజీ, 2024 ర్యాంక్‌, పర్సంటైల్‌ స్కోర్‌లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని పేర్కొంది.

గతంలో నీట్‌ పీజీ కట్-ఆఫ్ మార్పులు ఇలా..

తొలుత కటాఫ్‌ మార్కులు ఈ కింది విధంగా ఇచ్చారు..

  • జనరల్/EWS కోసం 50 శాతం
  • పీడబ్ల్యుడీలో 45 శాతం
  • ర్విజర్వ్‌డ్ కేటగిరీలకు 40 శాతం

అనంతరం ఈ ఏడాది ప్రారంభంలో జనరల్/EWS అభ్యర్థులకు కటాఫ్‌ను 15కి, SC/ST/OBC/PwD అభ్యర్థులకు 10కి తగ్గించారు. మునుపటి సంవత్సరాల్లో చూస్తే.. 2023లో అన్ని కేటగిరీలకు అర్హత శాతం మాత్రం సున్నాకి తగ్గించింది. అంటే పరీక్షకు హాజరైన అందరికీ మెడికల్‌ సీట్లు పొందేందుకు అర్హత కల్పించిందన్నమాట. ఇక 2022లో జనరల్ కేటగిరీ కటాఫ్ 50 పర్సంటైల్ నుంచి 35 పర్సంటైల్‌కు తగ్గించింది. అయితే పీడబ్ల్యుడీ, రిజర్వ్డ్ కేటగిరీలను 20 పర్సంటైల్‌కు తగ్గించారు. అర్హత శాతం అత్యల్పంగా ఉండటంతో ఎక్కువ మంది అభ్యర్థులు నీట్ పీజీ కౌన్సెలింగ్‌కు అర్హత సాధిస్తారు. ముఖ్యంగా అగ్రశ్రేణి సంస్థలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లకు పోటీ విపరీతంగా పెరుగుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులందరూ MCC అధికారిక వెబ్‌సైట్ ద్వారా కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.