NCERT-CIET Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో ఎన్సీఈఆర్టీలో ఉద్యోగాలు.. నెలకు రూ.60000ల జీతం..

భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్ (NCERT)కి చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్‌ కన్సల్టెంట్లు (పీహెచ్‌పీ ప్రోగ్రామర్లు, డేటాబేస్‌ డెవలపర్‌), సీనియర్‌ కన్సల్టెంట్ తదితర పోస్టుల (Technical Consultant Posts) భర్తీకి..

NCERT-CIET Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో ఎన్సీఈఆర్టీలో ఉద్యోగాలు.. నెలకు రూ.60000ల జీతం..
Ncert Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 26, 2022 | 6:53 AM

NCERT-CIET Consultant Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్ (NCERT)కి చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్‌ కన్సల్టెంట్లు (పీహెచ్‌పీ ప్రోగ్రామర్లు, డేటాబేస్‌ డెవలపర్‌), సీనియర్‌ కన్సల్టెంట్ తదితర పోస్టుల (Technical Consultant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 40

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: టెక్నికల్‌ కన్సల్టెంట్లు (పీహెచ్‌పీ ప్రోగ్రామర్లు, డేటాబేస్‌ డెవలపర్‌), సీనియర్‌ కన్సల్టెంట్లు (అకడెమిక్‌), సీనియర్‌ టెక్నికల్‌ కన్సల్టెంట్ (మొబైల్‌ డెవలపర్‌), కన్సల్టెంట్ (అనలిస్ట్‌-డేటా విజువలైజేషన్‌), కన్సల్టెంట్ (అకడెమిక్‌), సీనియర్‌ కన్సల్టెంట్లు (టెక్నికల్‌), అకడెమిక్‌ కన్సల్టెంట్, టెక్నికల్‌ కన్సల్టెంట్, కన్సల్టెంట్లు (గ్రాఫిక్స్‌), డేటా సైంటిస్ట్, అకడెమిక్‌ కన్సల్టెంట్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.45,000ల నుంచి రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్‌/ ఎంటెక్‌/ ఎంసీఏ, మాస్టర్స్‌ డిగ్రీ/ ఎంఫిల్‌/ పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. కంప్యూటర్, టైపింగ్‌ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

అడ్రస్‌: Section Officer (SO), Planning & Research Division (P&RD) Room No.242, CIET 2nd floor, Chacha Nehru Bhawan, CIET, NCERT, New Delhi-110 016.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.

ఇంటర్వ్యూ తేదీలు: 2022. జులై 6, 7, 8 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.