NIV Pune Recruitment 2021: నేషన్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేడే చివరి తేదీ..
NIV Pune Recruitment 2021: కరోనా మహమ్మారి సృష్టించిన భయాందోళన నేపథ్యంలో వైరస్‌లపై ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌లోనూ వైరస్‌లపై ప్రయోగాలు...
NIV Pune Recruitment 2021: కరోనా మహమ్మారి సృష్టించిన భయాందోళన నేపథ్యంలో వైరస్‌లపై ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌లోనూ వైరస్‌లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ రంగంలో ఉద్యోగాల నియమకాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా పుణెలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఆరోగ్య పరిశోధన విభాగం ఆధ్వర్యంలోని ఐసీఎంఆర్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ భాగంగా ఉంది.
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 36 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఇందులో భాగంగా ల్యాబొరేటరీ సపోర్ట్, సైంటిఫిక్ సపోర్ట్, అడ్మిన్ సపోర్ట్ పోస్టుల్లో ఉద్యోగులను తీసుకోనున్నారు.
* అర్హతల విషయానికొస్తే.. ల్యాబొరేటరీ సపోర్ట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత పోస్టు స్థాయిని అనుసరించి ఇంటర్మీడియట్, డీఎంఎల్‌టీ, గ్రాడ్యుయేషన్(లైఫ్ సైన్సెస్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.
* సైంటిఫిక్ సపోర్ట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు.. సంబంధిత ఖాళీల ఆధారంగా మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్/ ఎండీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థి వయసు 35 ఏళ్లు మించకూడదు.
* అడ్మిన్ సపోర్ట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 25 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
* అభ్యర్థులు తమ పూర్తి వివరాలను recruitmentniv@gmail.com మెయిల్‌కు పంపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తులకు చివరి తేదీగా 01.06.2021 నిర్ణయించారు. (నేడే చివరి తేదీ)
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
మెట్రో ప్రయాణికులకు ముఖ్య సూచన.. ఈ రోజు నుంచి రైలు వేళల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్