Actress Chandini Case: మూడుసార్లు అబార్షన్.. నగ్న ఫొటోలతో బెదిరింపులు..! నటి చాందిని కేసులో ఎమ్మెల్యే ఆగడాలు..
Actress Chandini Case: అన్నాడీఎంకే ముఖ్య నేత మాజీ మంత్రి మణికందన్ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి
Actress Chandini Case: అన్నాడీఎంకే ముఖ్య నేత మాజీ మంత్రి మణికందన్ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని వర్థమాన నటి చాందిని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనకు మణికందన్ మూడుసార్లు అబార్షన్ చేయించాడని చాందిని ఆరోపిస్తుంది. అతడి స్నేహితుడైన ఓ డాక్టర్ సహాయంతో అబార్షన్ చేయించాడని చెబుతుంది. అంతేకాకుండా రహస్యంగా తీసిన నా అంతరంగ ఫొటోలను టెలిగ్రాం ద్వారా పంపి బెదిరింపులకు దిగాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మంత్రి మణికంఠ తనతో దిగిన చిత్రాలను నటి చాందిని బయట పెట్టింది. తన జీవితాన్ని నాశనం చేసిన మంత్రి మణికందన్ బెదిరింపులకు బయపడేది లేదు అంటూ ఘాటుగా హీరోయిన్ చాందిని సమాధానం ఇచ్చింది. వారిద్దరికి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలను లీక్ చేసింది. అంతేకాకుండా తనకు న్యాయం జరిగేంత వరకు మౌనంగా ఉండేది లేదని స్పష్టం చేసింది. ఇదిలావుంటే, మణికందన్ అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. టీటీవీ దినకరన్ గ్రూపులో చేరిన రెబెల్‌గా ఆయన గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యతిరేక కూటమిలో చేరడం వల్ల ఆయన మంత్రి పదవిని కోల్పోయారు. కాగా, చాందిని ఫిర్యాదుతో చెన్నై పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.