AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loan App Case : ఆగిపోయిన ఖాతా నుంచి కోటి కొట్టేశాడు..! వీడు మామూలోడు కాదు.. లోన్ యాప్ కేసులో మరో ట్విస్ట్..

Loan App Case : అక్రమ మైక్రోఫైనాన్సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ పోలీసులకు ఊహించని సమస్య ఎదురైంది.

Loan App Case : ఆగిపోయిన ఖాతా నుంచి కోటి కొట్టేశాడు..! వీడు మామూలోడు కాదు.. లోన్ యాప్ కేసులో మరో ట్విస్ట్..
Froad
uppula Raju
|

Updated on: Jun 01, 2021 | 8:10 AM

Share

Loan App Case : అక్రమ మైక్రోఫైనాన్సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ పోలీసులకు ఊహించని సమస్య ఎదురైంది. ఓ పక్క ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు న్యాయస్థానంలో అభియోగపత్రాలు కూడా దాఖలు చేశారు. అయితే ఈ కేసునే టార్గెట్ చేసిన ఓ సైబర్ కేటుగాడు పోలీసులు డీ ఫ్రీజ్ చేయించిన అకౌంట్ నుంచి కోటి రూపాయలు స్వాహా చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇది ఎలా జరిగిందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. వివరాల్లోకి వెళితే..

గతంలో అక్రమ వ్యవహారాలకు పాల్పడ్డ 32 కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాలను గుర్తించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రూ.400 కోట్లకుపైగా ఫ్రీజ్‌ చేశారు. ఈ ఖాతాల్లో కోల్‌కతాలోని ఐల్‌పోరే ప్రాంతంలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులో కూడా ఉంది. ఈ ఖాతాను పోలీసులు గత ఏడాది డిసెంబర్‌లో స్తంభింపచేశారు. ఈ సమాచారం తెలుసుకున్న నిందితుడు ఎలాగైనా డబ్బు కొట్టేయాలని పథకం వేశాడు. అక్కడి బ్రాంచ్ మేనేజర్‌ను బోల్తా కొట్టించి డబ్బు ఉడాయించాడు.

తాను హైదరాబాద్ సైబర్ క్రైమ్‌లో ఎస్సైగా పనిచేస్తున్నానని నకిలీ పత్రాలను క్రియేట్ చేసి వాటిని సదరు బ్యాంకు మేనేజర్‌కి సమర్పించాడు. మేనేజర్‌ని మాటల్లో దింపి డీ ఫ్రిజ్ అయిన ఖాతాలను యాక్టివేట్ చేయించాడు. ఆపై గత నెల 13నరూ.1,18,70,779 స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆనంద్‌ జన్ను పేరుతో ఉన్న ఖాతాలోకి బదిలీ చేసి స్వాహా చేశాడు. గత నెల 20 మరికొంత మొత్తం ట్రాన్స్‌ఫర్‌ చేయించడానికి ప్రయత్నించాడు. దీనిని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. దీంతో బ్యాంకు రీజనల్‌ మేనేజర్‌కు నోటీసులు జారీ చేశారు. వెంటనే బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వివరాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: లారీ బ్రేక్ ఫెయిల్.. రివర్స్ గేరులో 3 కిమీలు వెనక్కి.. చివ‌ర‌కు ఏం జరిగిందంటే

SV Prasad : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్వీ ప్ర‌సాద్ కరోనాతో క‌న్నుమూత‌

ఇవాళ్టి నుంచి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ.. రంగంలోకి దిగిన 2.66 లక్షల మంది వాలంటీర్లు

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?