SV Prasad : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ కరోనాతో కన్నుమూత
కరోనా చికిత్స పొందుతున్న ఎస్వీ ప్రసాద్ కొంచెం సేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు...
Andhra Pradesh Former CS SV Prasad dies of corona : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ ఇకలేరు. గత కొన్ని రోజులుగా కరోనా చికిత్స పొందుతున్న ఎస్వీ ప్రసాద్ కొంచెం సేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. చంద్రబాబు సహా పలువురు ముఖ్యమంత్రులకు కార్యదర్శిగా పనిచేసిన ఎస్వీ ప్రసాద్.. నిబద్ధత కలిగిన ఉన్నతాధికారిగా గుర్తింపు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో విజిలెన్స్ కమిషనర్ గా ప్రసాద్ పనిచేశారు. కాగా హైదరాబాద్‌లో నివసిస్తున్న ఎస్వీ ప్రసాద్ కుటుంబం మొత్తం ఇటీవల కరోనా బారిన పడింది. దీంతో ప్రసాద్ దంపతులు యశోద ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఎస్వీ ప్రసాద్ భార్య పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెబుతున్నారు. ఎస్వీ ప్రసాద్ పెద్ద కుమారుడు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతుండగా, చిన్న కుమారుడు కరోనా నుంచి కోలుకుంటున్నారు. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎస్.వి.ప్రసాద్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.