Sasikala : ‘శశికళను తిరిగి పార్టీలోకి రానిచ్చేది లేదు.. అదంతా ఆమె ఆడుతోన్న నాటకం..’ తేల్చి చెప్పిన అన్నాడీఎంకే

శశికళ మాటలుగా చెబుతోన్న ఆడియో పై అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుసామి తీవ్రంగా స్పందించారు..

Sasikala : 'శశికళను తిరిగి పార్టీలోకి రానిచ్చేది లేదు.. అదంతా ఆమె ఆడుతోన్న నాటకం..'  తేల్చి చెప్పిన అన్నాడీఎంకే
Sasikala
Follow us

|

Updated on: Jun 01, 2021 | 7:30 AM

AIADMK dismisses Sasikala’s talk : అన్నాడీఎంకే పార్టీలో ప్రస్తుతం రాజకీయం రంజుగా మారింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో AIADMK పార్టీ అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో.. తాను మళ్లీ పార్టీ పగ్గాలు చేపడతానంటూ శశికళ వ్యాఖ్యలు చేసినట్టుగా ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ భ్రష్టు పట్టిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేనని, తానొచ్చి మళ్లీ పార్టీని గాడిన పెడతానని తన మద్దుతుదారులకు శశికళ భరోసా ఇచ్చినట్టు సదరు వార్తల సారాంశం. శశికళ మాటలుగా చెబుతోన్న ఆడియో లీకులపై అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుసామి తీవ్రంగా స్పందించారు. శశికళను ఎట్టిపరిస్థితుల్లోనూ మళ్లీ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీపై పట్టుకోసం కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అన్నాడీఎంకే కార్యకర్తలకు, శశికళకు ఎలాంటి సంబంధం లేదన్న మునుసామి.. మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు శశికళ ఆడుతున్న డ్రామాగా దీనిని అభివర్ణించారు. తమ పార్టీలో ఎవరూ శశికళతో మాట్లాడలేదన్న ఆయన.. పార్టీని నిర్మించినది శశికళ లాంటి వారు కాదని, ఎంజీ రామచంద్రన్ పార్టీని స్థాపించినప్పటి నుంచి కార్యకర్తలే పార్టీకి వెలకట్టలేని సేవలు చేశారని ఆయన పేర్కొన్నారు. పళనిస్వామి – పన్నీర్‌సెల్వం మధ్య విభేదాలున్నట్టు జరుగుతున్న ప్రచారం కూడా శశికళ కుట్రగా ఆయన అభివర్ణించారు.

ఇలాఉండగా, జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే అధ్యక్షురాలిగా వ్యవహరించిన శశికళ.. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లాక అధ్యక్ష స్థానాన్ని కోల్పోవడం.. ఆ తర్వాత రాజకీయాలు వీడి ఆధ్యాత్మిక మార్గాన్ని పాటిస్తున్నట్టు శశికళ పేర్కొనడం తెలిసిందే. అయితే, ఇప్పుడు మళ్లీ శశికళ యూటర్న్ తీసుకునేందుకు పావులు కదుపుతున్నట్టు తమిళనాట చర్చ జరుగుతోంది.

Read also : Allopathy treatment : బ్లాక్ డే : బాబా రాందేవ్ వ్యాఖ్యలకు నిరసనగా నేడు ఆలోపతి వైద్యుల దేశవ్యాప్త నిరసన