Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Ramdev: : బ్లాక్ డే : బాబా రాందేవ్ వ్యాఖ్యలకు నిరసనగా నేడు ఆలోపతి వైద్యుల దేశవ్యాప్త నిరసన

రాందేవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా అల్లోపతి వైద్యులు 'బ్లాక్ డే' పాటిస్తున్నారు..

Baba Ramdev: : బ్లాక్ డే  :  బాబా రాందేవ్ వ్యాఖ్యలకు నిరసనగా నేడు ఆలోపతి వైద్యుల దేశవ్యాప్త నిరసన
Baba Ramdev
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 01, 2021 | 8:49 AM

Doctors Doctors protest against Ramdev’s remarks : ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా అల్లోపతి వైద్యులు ‘బ్లాక్ డే’ పాటిస్తున్నారు. అయితే, దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న ఈ నిరసనల వల్ల రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఎఫ్ఓఆర్‌డీఏ) తెలిపింది. అల్లోపతి వైద్యంపై బాబా రాందేవ్ అవమానకర, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈ పిలుపు ఇచ్చినట్టు ఫెడరేషన్ ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఓ వ్యాపారవేత్తగా ప్రస్తుత పరిస్థితిని సొమ్ము చేసుకునే ఉద్దేశంతోనే ప్రజలను తప్పుదోవ పట్టించేలా బాబా రాందేవ్ ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేస్తున్నారని ఐఎంఏ(ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్) మండిపడింది. అల్లోపతి వైద్యంపైనా, కరోనా వ్యాక్సిన్లపైనా బాబా రాందేవ్ గత వారం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్.. బాబా రాందేవ్ మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్రానికి 14 పేజీల ఫిర్యాదును కేంద్రానికి పంపింది.

కాగా, రాందేవ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లోపతిని ‘స్టుపిడ్ సైన్స్’ గా కొట్టిపారేశారు. ఈ వ్యాఖ్యలపైనే ఇవాళ నిరసన చేపట్టారు. బాబా రాందేవ్ అల్లోపతి వైద్యం మీద చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కూడా ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేయగా, రాందేవ్ బాబా తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు.

Read also : Paytm IPO : పేటీఎమ్‌ ఐపీవోకు గ్రీన్‌సిగ్నల్‌.. రూ.22,000 కోట్ల అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూ.. !

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్