Ornaments in Thief Stomach: కర్ణాటకలో విచిత్ర ఘటన.. 35 గ్రాముల బంగారం మింగేసిన దొంగ.. ఎందుకంటే..
Ornaments in Thief Stomach: దక్షిణ కన్నడ జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు..
Ornaments in Thief Stomach: దక్షిణ కన్నడ జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు షిబు అనే ఓ వ్యక్తి 35 గ్రాముల బంగారాన్ని మించేశాడు. అయితే, ఆభరణాలు మింగడంతో నిందితుడికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దాంతో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షలు జరిపారు. ఎక్స్‌రే స్కాన్ చేయడంలో అతని పేగుల్లో ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. చివరిక ఆపరేషన్ చేసి అతని కడుపులో ఉన్న ఆభరణాలను బయటకు తీశారు.
35 గ్రాముల బరువు ఉన్న ఈ ఆభరణాల్లో ఎక్కువగా చేతి ఉంగరాలు, చెవి పోగులు ఉన్నాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పోలీసుల నుంచి తప్పించుకునేందుకే నిందితుడు ఐస్ క్రీమ్‌తో పాటు బంగారు ఆభరణాలను మింగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత పోలీసులు అతన్ని జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.
Also read: