AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు..

Earthquake: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 2.4 గా నమోదైంది.

Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు..
Earthquake
Shiva Prajapati
|

Updated on: May 31, 2021 | 11:46 PM

Share

Earthquake: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 2.4 గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం రోహిణిలో ఇవాళ రాత్రి వేళ భూమి కంపించింది. దాంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా హడలిపోయారు. ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంప తీవ్రత తగ్గువగా ఉండటంతో ఎలాంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ సంభవించలేదు. కాసేపటి తరువాత రోహిణి ప్రాంతంలో పరిస్థితులు చక్కబడ్డాయి.

భూకంపం ఎందుకు సంభవిస్తుంది..? భూమి అనేక పొరలుగా విభజించబడింది. భూమి క్రింద అనేక రకాల ప్లేట్లు ఉన్నాయి. అయితే కలిసి ఉన్న ప్లేట్లు భూమి లోపలి ఉష్ణోగ్రతల ఆధారంగా ఆ ప్లేట్లు అటూ ఇటూ కదులుతుంటాయి. ఫలితంగా భూకంపం సంభవిస్తుంటుంది. అయితే, ఇటీవలి కాలంలో దేశంలో తరచూ భూమి కంపిస్తూనే ఉంది.

భూకంపం సంభవించినప్పుడు ఏం చేయాలి.. ఏం చేయకూడదు… 1. భూమి కంపిస్తున్నట్లు అనిపించిన వెంటనే.. బలమైన టేబుల్ కింద కూర్చుని గట్టిగా పట్టుకోవాలి. 2. ప్రకంపనలు కొనసాగుతున్నంత కాలం లేదా మీరు సురక్షితంగా బయటపడే పరిస్థితి లేకపోతే అదే స్థలంలో కూర్చోవాలి. 3. మీరు ఎత్తైన భవనంలో నివసిస్తుంటే, కిటికీకి దూరంగా ఉండండి. 4. మీరు మంచంలో ఉంటే, అక్కడే ఉండి గట్టిగా పట్టుకోండి. మీ తలపై ఒక దిండు ఉంచండి. 5. మీరు బయట ఉంటే, అప్పుడు ఖాళీ ప్రదేశానికి వెళ్లండి. అంటే భవనాలు, ఇళ్ళు, చెట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా. 6. మీరు డ్రైవింగ్ చేస్తుంటే, కారు వేగాన్ని తగ్గించి ఖాళీ స్థలంలో ఉంచండి. ప్రకంపనలు పోయే వరకు కారులో ఉండండి. 7. మీరు వెలుపల, రహదారిపై లేదా మార్కెట్లో ఉంటే, అప్పుడు భూమికి లేదా సమీప ప్రదేశానికి చేరుకోండి. 8. ఎత్తైన భవనాలకు దూరంగా నడవండి. 09. చెట్లు మరియు విద్యుత్ తీగలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.

Also read:

UFO: గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారా? సముద్రతలంపై ఎగురుతున్న 14 యుఎఫ్ఓలు.. షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి..