AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Doctors Black Day: రాందేవ్ బాబా వ్యాఖ్యలపై వెనక్కు తగ్గని వైద్యులు.. రేపు దేశవ్యాప్తంగా ‘బ్లాక్ డే’ పాటించాలని పిలుపు

అల్లోపతి వర్సస్ అయుర్వేదం రగడ పీక్ స్టేజ్‌కి చేరింది. అల్లోపతి వైద్య విధానంపై యోగా గురు బాబా రాందేవ్ చేస్తున్న విమర్శలకు నిరసనగా జూన్ 1 అంటే రేపు దేశవ్యాప్తంగా ‘బ్లాక్ డే’ పాటించాలని వైద్యుల పిలుపు.

Doctors Black Day: రాందేవ్ బాబా వ్యాఖ్యలపై వెనక్కు తగ్గని వైద్యులు.. రేపు దేశవ్యాప్తంగా ‘బ్లాక్ డే’ పాటించాలని పిలుపు
Doctors Association Calls For Black Day On June 1 Over Baba Ramdev Comments
Balaraju Goud
|

Updated on: May 31, 2021 | 9:50 PM

Share

Doctors Black Day on June 1:  అల్లోపతి వర్సస్ అయుర్వేదం రగడ పీక్ స్టేజ్‌కి చేరింది. అల్లోపతి వైద్య విధానంపై యోగా గురు బాబా రాందేవ్ చేస్తున్న విమర్శలకు నిరసనగా జూన్ 1 అంటే రేపు దేశవ్యాప్తంగా ‘బ్లాక్ డే’ పాటించాలని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఎఫ్ఓఆర్‌డీఏ) పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా వైద్యులందరూ నినసనలు తెలపాలని డాక్టర్స్ అసోసియేషన్ కోరింది. అల్లోపతి వైద్యంపై బాబా రాందేవ్ అవమానకర, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈ పిలుపు ఇచ్చినట్టు పేర్కొంది. అయితే, దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ నిరసనల వల్ల రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది.

అల్లోపతి వైద్యంపైనా, కరోనా వ్యాక్సిన్లపైనా బాబా రాందేవ్ గత వారం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఓ వ్యాపారవేత్తగా ప్రస్తుత పరిస్థితిని సొమ్ము చేసుకునే ఉద్దేశంతోనే ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేస్తున్నారని ఐఎంఏ ధ్వజమెత్తింది. ఈ మేరకు కేంద్రానికి 14 పేజీలతో కూడిన ఫిర్యాదు చేసింది. రాందేవ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లోపతిని ‘స్టుపిడ్ సైన్స్’గా కొట్టిపారేశారు. ఆయన వ్యాఖ్యలపై భగ్గుమన్న ఐఎంఏ భేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

ఇదిలావుంటే, బాబా రాందేవ్ వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కూడా ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దిగి వచ్చిన రాందేవ్ తన మాటలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతటితో ఆగకుండా ఐఎంఏ వైద్య బృందం కేంద్ర ప్రభుత్వానికి బాబా రాందేవ్‌పై ఫిర్యాదు చేసింది.

కాగా, అలోపతి వైద్యంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు యోగా గురు బాబా రాందేవ్‌ . కరోనాతో పాటు చాలా రోగాలకు అలోపతి కంటే ఆయుర్వేదం లోనే మంచి మందులు ఉన్నాయని అన్నారు. సర్జరీ, లైఫ్‌ సేవింగ్‌ డ్రగ్స్‌తో అలోపతి వైద్యం జరుగుతోందని, కానీ 98 శాతం రోగాలకు ఆయుర్వేదంలో చికిత్స ఉందన్నారు రాందేవ్‌

అలోపతికి తాను వ్యతిరేకం కాదని, కానీ ఐఎంఏ ఆయుర్వాదాన్ని నాన్సెన్స్‌ అని అనడం తట్టుకోలేపోతున్నట్టు బాబా రాందేవ్‌ పేర్కొన్నారు. ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని ఆయన కోరారు. అక్షయ్‌కుమార్‌ , అమీర్‌ఖాన్‌ లాంటి నటులు కూడా అలోపతి కంటే ఆయుర్వేదమే బెటరని అన్నారని, వాళ్లపై కేసులు పెడతారా అని బాబా రాందేవ్ ప్రశ్నించారు.

Read Also….  Pvt. Hosptals No Permission: ప్రైవేట్ ఆసుపత్రుల కాసుల కక్కుర్తిపై తెలంగాణ సర్కార్ సీరియస్.. మరో 6 హాస్పిటల్స్ పర్మిషన్ రద్దు..!