Etela Rajender: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో.. ఈటల రాజేందర్ భేటీ..
Etela Rajender meets JP Nadda: ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ
Etela Rajender meets JP Nadda: ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఆయనతోపాటు ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్, మాజీ ఎంపీ వివేక్ తదితరులు ఉన్నారు.
ఈటల రాజేందర్‌ను రాష్ట్రమంత్రి వర్గం నుంచి తొలగించిన అనంతరం ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయిదారు రోజుల్లో ఈటల రాజేందర్ హుజూరాబాద్ వెళ్లి వచ్చాక బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గానికి వెళ్లివచ్చిన తర్వాతే ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్‌కు రాజీనామా చేయాలని ఈటల యోచిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
కాగా.. ఈ భేటీపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి రాజేందర్ ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలను వెల్లడిస్తారని పేర్కొంటున్నారు.
Also Read: