India GDP: కరోనా ఎఫెక్ట్ .. నాలుగు దశాబ్దాల కనిష్ఠానికి దేశ జీడీపీ.. ఎంతమేర తగ్గిందంటే..?
India's economic growth: కరోనావైరస్ మహమ్మారి ప్రారంభం నాటినుంచి ఆర్థిక వ్యవస్థ కుదేలైన విషయం తెలిసిందే. ఏడాది గడిచినప్పటికీ ఆర్ధిక వ్యవస్థ గాడిలో
India’s economic growth: కరోనావైరస్ మహమ్మారి ప్రారంభం నాటినుంచి ఆర్థిక వ్యవస్థ కుదేలైన విషయం తెలిసిందే. ఏడాది గడిచినప్పటికీ ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడటం లేదు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రభావం 2020-21 దేశ జీడీపీపై గట్టిగానే పడింది. 2021 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ ఏకంగా 7.3 శాతం పతనమైంది. ఆర్థిక సంవత్సరం చివరన జనవరి-మార్చి (నాలుగో త్రైమాసం)లో ఆర్థిక కార్యకలాపాలు కొంతమేర గాడినపడటంతో జీడీపీ 1.3 శాతం పెరిగిందని కేంద్ర గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) వెల్లడించింది. నాలుగు దశాబ్దాల చరిత్రలో ఇదే కనిష్టం కావడం గమనార్హం. కాగా గతేడాది దేశ జీడీపీ 4.2 శాతానికే పరిమితమైంది.
2020-21 ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 1.6 శాతం వృద్ధిని సాధించినట్లు ఎన్ఎస్ఓ వెల్లడించింది. మూడో త్రైమాసికంతో పోలిస్తే.. 0.5శాతం పెరుగుదల కనిపించిందని పేర్కొంది. దీనివల్ల స్థూల దేశీయోత్పత్తి కొంతమేర గాడిన పడినట్లు వెల్లడించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా గతేఏడాది సుదీర్ఘ లాక్ డౌన్, కఠిన నియంత్రణలతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. టూరిజం, విమానయానం, వినోదం, పలు రంగాలు కోలుకోలేకుండా పతనమయ్యాయి. చిన్న మధ్యతరహా పరిశ్రమలు, నిర్మాణ రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.
ఇక 2021-22 ఆర్థిక సంవత్సరంలో గత ఏడాదితో పోలిస్తే రెండంకెల ఆర్థిక వృద్ధి రేటు నమోదవుతుందనే అంచనాలు వెల్లడయ్యాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ ఆర్ధిక వ్యవస్థ రికవరీకి అడ్డుకట్ట వేస్తుందనే ఆందోళన ప్రస్తుతం భయపెడుతోంది.
Also Read: