Salary Hike News: వేతనాల పెంపునకే ఐటీ కంపెనీల మొగ్గు… మిగిలిన ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఎప్పుడో?

కరోనా మూలంగా అన్ని రంగాలతో పాటు ఐటీ పరిశ్రమ కూడా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంది. కరోనా ప్రభావం కారణంగా గత ఏడాది చాలా కంపెనీలు ఉద్యోగులకు వేతనాలు పెంచకపోగా...ఎక్కువ వేతనాలు తీసుకునే వారి ప్యాకేజీల్లో కోతపెట్టాయి.

Salary Hike News: వేతనాల పెంపునకే ఐటీ కంపెనీల మొగ్గు... మిగిలిన ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఎప్పుడో?
Salary Hike
Follow us

|

Updated on: May 31, 2021 | 8:54 PM

కరోనా మూలంగా అన్ని రంగాలతో పాటు ఐటీ పరిశ్రమ కూడా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంది. కరోనా ప్రభావం కారణంగా గత ఏడాది చాలా కంపెనీలు ఉద్యోగులకు వేతనాలు పెంచకపోగా…ఎక్కువ వేతనాలు తీసుకునే వారి ప్యాకేజీల్లో కోతపెట్టాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగాల్లో కోతపెట్టాయి.  ఆ తర్వాత పరిస్థితులు కుదుటపడటంతో ఉద్యోగులు వేతన పెంపు కోసం పక్క చూపులు మొదలుపెట్టడంతో కంపెనీలు నష్టనివారణ చర్యలకు పూనుకున్నాయి. నైపుణ్యులైన ఉద్యోగులు చేజారకుండా వారికి మునుపటి వేతన ప్యాకేజీలను పునరుద్ధరించాయి. కొన్ని కంపెనీలు వారి వేతనాలు పెంచడంతో పాటు బోనస్ కూడా ప్రకటించాయి.  మిగతా రంగాలతో పోలిస్తే..ఐటీ పరిశ్రమ వేగంగా కోలుకుంది.  అయితే సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ మాసం నుంచి తిరిగి ఐటీ కంపెనీలు మందగమనంలో సాగుతున్నాయి. పరిస్థితులు మెరుగుపడటంతో ఉద్యోగులకు వేతన పెంపును కొన్ని కంపెనీలు ప్రకటించాయి. చాలా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోంను కొనసాగిస్తున్నాయి. కొవిడ్ కాలంలో క్లైంట్లకు సేవలందించినందుకు వేతనాలు పెంచిన కంపెనీలు..

టీసీఎస్… ఏప్రిల్ 2021 నుంచి వర్తించే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగులకు వేతనాలు పెంపును టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ప్రకటించింది. గత ఆరు నెలల్లో  రెండోసార్లు వేతనాలు పెంచడం విశేషం. అంతకు ముందు 1-10-2020 నుంచి వేతనాలను పెంచింది టీసీఎస్.

కాగ్నిజెంట్.. మార్చి నుంచి వర్తించేవిధంగా తన ఉద్యోగులకు ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఇండియా బోనస్ ప్రకటించింది. ఉద్యోగులకు బోనస్ లు ప్రకటించిన కంపెనీల్లో.. అక్సెంచర్, పీడబ్ల్యుసీ కూడా ఉన్నాయి.

ఇన్ఫోసిస్.. అక్టోబర్ 2020 ప్రకటన ప్రకారం, జనవరి 1 2020 నుంచి వేతనాల పెంపును అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.

హెచ్ సీఎల్… అక్టోబర్ 2020 నుంచి కొంతమంది ఉద్యోగులకు, జనవరి 2021 నుంచి కొంతం మంది ఉద్యోగులకు వేతనాలు పెంపును వర్తింపచేస్తున్నట్లు వెల్లడి.

Work From Home

Work From Home

వేతనాలు పెంచుతామన్న 59 శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు వేతనాల పెంపు పట్ల  59శాతం కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. దేశ వ్యాప్తంగా 1200 కంపెనీలపై ఇండియా టుడే ఆన్ సర్వేని నిర్వహించింది.  బ్యాంకింగ్, ఫైనాన్స్, నిర్మాణరంగం, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్/టీచింగ్/ట్రెయినింగ్, ఎంఎంసీజీ, హాస్పిటాలిటీ, హెచ్ ఆర్ సొల్యుషన్స్, ఐటీ/ఐటీఈఎస్, బీపీవో, లాజిస్టిక్స్, మ్యానుఫాక్చరింగ్, మీడియా, ఆయిల్, గ్యాస్, ఫార్మా, వైద్య, విద్యుత్, రియల్ ఎస్టేట్, రిటైల్, టెలీకాం, ఆటో, ఇతర అనుబంధ రంగాలకు చెందిన ఈ 1200 కంపెనీల యాజమాన్యాల అభిప్రాయాలు సేకరించింది. వేతనాలు పెంపు 5 శాతం కంటే తక్కువ ఇస్తామన్న 20 శాతం కంపెనీలు ప్రకటించాయి. వేతనాల పెంపు అవసరంలేదని 21 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. కొత్త నియామకాలు చేపడతామని 43 శాతం కంపెనీలు తెలిపాయి. రీప్లేస్ మెంట్ హైరింగ్స్ చేస్తామని 41 శాతం కంపెనీలు వెల్లడించాయి. నియామకాలు చేసే అవకాశాలు లేవని  11 శాతం కంపెనీలు తెలిపాయి.

మిగిలిన ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఎప్పుడు? ఐటీ కంపెనీలు వేతనాల పెంపును ప్రకటిస్తున్నా…మిగిలిన కంపెనీలు మాత్రం నాన్చివేత ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. ఏప్రిల్ మాసం నుంచే వేతనాలు పెంచాల్సి ఉండగా…రెండు మాసాలు గడిచినా ఇప్పటి వరకు నోరుమెదపడం లేదు. పరిస్థితి చక్కబడితే ఏప్రిల్ మాసం నుంచి వర్తించేలా వేతనాలు పెంచే యోచనాలో చాలా కంపెనీలు ఉన్నాయి. అయితే గత సంవత్సరం కూడా వేతన పెంపు దక్కకపోవడంతో…ఈ సారి ఆ పరిస్థితి రావద్దని ఉద్యోగులు గుబులు చెందుతున్నారు. కోవిడ్ పాపం కారణంగానే ఈ దుస్థితి నెలకొంటోందని వాపోతున్నారు. గత ఏడాది కోవిడ్ కారణంగా వేతనాల పెంపు ఇవ్వని కంపెనీలు..ఈ సారి తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

 జూన్‌లో జోరందుకోనున్న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ.. కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన

వీడు సామాన్యుడు కాదు.. గాలిలో ఎగిరిన ఐఫోన్.. క్యాచ్ పట్టిన రైడర్.. చూస్తే షాకవ్వాల్సిందే.. Viral Video

సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!