UFO: గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారా? సముద్రతలంపై ఎగురుతున్న 14 యుఎఫ్ఓలు.. షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి..
UFO: గ్రహాంతర వాసులు ఉన్నారా? తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. గ్రహాంతర వాసుల ఉనికిని నిర్ధారిస్తుందా? ఈ ప్రశ్నలకు అవుననే...
UFO: గ్రహాంతర వాసులు ఉన్నారా? తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. గ్రహాంతర వాసుల ఉనికిని నిర్ధారిస్తుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు పలువురు. ప్రముఖ హాలీవుడ్ సినీ నిర్మాత జెరెమీ కార్బెల్ తాజాగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో ఈ సందేహాలను లేవనెత్తింది. యూఎస్ నేవి రాడార్‌లో ఒకేసారి 14 యూఎఫ్‌ఓలు(అన్ ఐడెంటీఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్(ఎగిరే పల్లాలు)) కనిపించాయని ఆయన ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోలో రాడార్ స్క్రీన్‌పై 14 యుఎఫ్ఓలు కనిపిస్తున్నాయి. ఇందులో యుఎఫ్ఓ వేగం 70 నుంచి 250 కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ స్పీడ్ యూఎస్ఎస్ ఒమాహా అనే అమెరికన్ షిప్ కంటే మూడు రెట్లు ఎక్కువ అని చెప్పవచ్చు. కాగా, నేవి అధికారులు తరచూ యుఎఫ్ఓల కదలికలను పరిశీలించేవారని ఆయన అందులో పేర్కొన్నారు. యుఎఫ్ఓ కు సంబంధించిన మునుపటి వీడియోలను కూడా ఆన్ బోర్డ్ కెమెరాలో చిత్రీకరించారు. యుఎఫ్ఓ లాంటి వస్తువులు సముద్రం మీదుగా ఎగురుతున్నట్లు కనిపించిందని, ఆ తరువాత కాసేపటికే అకస్మాత్తుగా అదృశ్యమైందని అమెరికన్ నేవీ మాజీ అధికారులు తెలిపారు.
కోర్బెల్ ప్రకారం.. కొత్తగా విడుదలైన ఈ వీడియోను నేవీ కమాండ్ సెంటర్ నుండి తయారు చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, వీడియో ఫుటేజీని రహస్యంగా ఉంచలేమని పేర్కొన్నారు. కొర్బెల్ ఇప్పటికే గుర్తించబడని ఏరియల్ ఫెనోమెనా టాస్క్ ఫోర్స్ వివరణకు సంబంధించిన చిత్రాలను షేర్ చేశారు. ఇది అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ చేత ధృవీకరించబడింది.
ఇదిలాఉంటే.. పెంటగాన్ ప్రతినిధి సుసాన్ గోఫ్ ఏప్రిల్‌లో బ్లాక్ వాల్ట్ వెబ్‌సైట్‌తో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘యుఎపిటిఎఫ్ (గుర్తించబడని ఏరియల్ ఫెనోమెనా టాస్క్ ఫోర్స్) కదలికలను దర్యాప్తులో చేర్చడం జరిగింది’’. ‘‘అలాగే, మే 15వ తేదీన కార్బెల్ విడుదల చేసిన వీడియోను పెంటగాన్ (యుఎఫ్‌ఓ ఆన్ ఓషన్) కూడా ధృవీకరించింది. రౌండ్ ఆకారంలో ఉన్న యుఎఫ్ఓలు సముద్రంపై కనిపించాయని, తరువాత ఇది అకస్మాత్తుగా అదృశ్యమైందని అధికారులు పేర్కొన్నారు.
Also read: