AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవాళ్టి నుంచి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ.. రంగంలోకి దిగిన 2.66 లక్షల మంది వాలంటీర్లు

రాష్ట్రంలో 61.46 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఈ నెలలో కొత్తగా 29,961 మంది అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారు. మే నెల పెన్షన్ మొత్తాలను జూన్ 1వ తేదీన నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దే..

ఇవాళ్టి నుంచి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ.. రంగంలోకి దిగిన 2.66 లక్షల మంది వాలంటీర్లు
Ysr Pension Kanuka
Sanjay Kasula
|

Updated on: Jun 01, 2021 | 7:44 AM

Share

వైఎస్సార్‌ పెన్షన్ కానుక పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. దీని ద్వారా రాష్ట్రంలో 61.46 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఈ నెలలో కొత్తగా 29,961 మంది అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారు. మే నెల పెన్షన్ మొత్తాలను జూన్ 1వ తేదీన నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దే, వారి చేతికి అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పంలో భాగంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం (జూన్ 1వ తేదీ) తెల్లవారుజాము నుంచే వలంటీర్లు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.

ఈ మేరకు పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.1497.62 కోట్ల రూపాయలను ఇప్పటికే విడుదల చేసింది. ఈ మొత్తాలను గ్రామ, వార్డు సచివాలయాలకు పంపిణీ చేశారు. సచివాలయాల ద్వారా వలంటీర్లు పెన్షనర్లకు వారి ఇంటి వద్ద, నేరుగా పెన్షనర్ల చేతికే పెన్షన్ మొత్తాలను అందచేస్తారు. ఇందుకోసం 2.66 లక్షల మంది వలంటీర్లు పని చేస్తున్నారు. లబ్ధిదారులకు పెన్షన్ అందచేసే సందర్భంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలు చేస్తారు.

అలాగే ఆర్‌బిఐఎస్ విధానంను కూడా అందుబాటులోకి రానుంది. ఈ రెండు విధానాల్లో పెన్షనర్ల గుర్తింపు సాధ్యం కాకపోతే అంతకు ముందే వారి కుటుంబసభ్యులు నమోదు చేయించుకున్న ఆథరైజ్డ్ బయోమెట్రిక్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పెన్షన్ అందలేదనే ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. పెన్షన్ మొత్తాలను మూడు రోజుల్లో నూరుశాతం పంపిణీ పూర్తి అయ్యేలనే టార్గెట్‌ పని చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో 15వేల మంది వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, వార్డు వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సెక్రటరీలు భాగస్వాములు అవుతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల డిఆర్‌డిఎ కార్యాలయాల్లోని కాల్ సెంటర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని పర్యవేక్షిచనున్నారు.

ఇవి కూడా చదవండి : Good News: ఈ రోజు నుంచి మార్కెట్లోకి రానున్న డీఆర్‌డీవో మందు.. అందుబాటులోకి 6-8 లక్షల 2డీజీ మెడిసిన్ ప్యాకెట్లు

Good News: జూన్‌లో జోరందుకోనున్న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ.. కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన

New Rules From Today: ఈ రోజు నుంచి చాలా మారిపోతున్నాయి..! గమనించారా..! అయితే మీ ఇష్టం..!

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు