TS Inter: తెలంగాణ ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం.. కరోనా కారణంగా ఆన్‌లైన్‌లోనే ఎన్‌రోల్‌మెంట్..
TS Inter: తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్‌బీఐఈ) మే 25న ప్రారంభించిన ఈ ప్రక్రియ జూలై 5 వరకు కొనసాగనుంది..
TS Inter: తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్‌బీఐఈ) మే 25న ప్రారంభించిన ఈ ప్రక్రియ జూలై 5 వరకు కొనసాగనుంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోన్న వేళ.. అడ్మిషన్ల కోసం కాలేజీలకు రాకుండా, ఆన్‌లైన్‌లో అడ్మిషన్లను స్వీకరించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. నేటి నుంచి (మంగళవారం) ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆన్‌లైన్ ధరఖాస్తులు ప్రారంభించారు. 404 ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులు నేరుగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి సెల్ఫ్ ఎన్‌రోల్‌మెంట్ విధానాన్ని ఇంటర్ బోర్డ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం అభ్యర్థులు ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/ సందర్శించాలి.
ఎలా అప్లై చేసుకోవాలంటే..
* అభ్యర్థులు ముందుగా https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* అనంతరం హోమ్ పేజీలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల అడ్మిషన్స్ అనే ట్యాగ్‌ని క్లిక్ చేయాలి.
* తర్వాత పదో తరగతి హాల్ టికెట్‌ను ఎంటర్ చేసిన అడ్మిషన్ ప్రక్రియను కొనసాగించాల్సి ఉంటుంది.
* ఇక ఇంటర్ అడ్మిషన్‌ల విషయంలో పదో తరగతి లో వచ్చిన గ్రేడ్స్‌ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని కళాశాలలకు ఇంటర్ బోర్డ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.