NFL Recruitment 2022: బీటెక్ అభ్యర్ధులకు బంపరాఫర్.. రూ.2,20,000ల జీతంతో నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు..
భారత ప్రభుత్వరంగానికి చెందిన ఉత్తరప్రదేశ్‌లోని నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL).. సీనియర్ మేనేజర్, ఇంజినీర్, సీనియర్ కెమిస్ట్ తదితర పోస్టుల (Senior Manager Posts) భర్తీకి అర్హులైన..
NFL Special Recruitment drive 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన ఉత్తరప్రదేశ్‌లోని నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL).. సీనియర్ మేనేజర్, ఇంజినీర్, సీనియర్ కెమిస్ట్ తదితర పోస్టుల (Senior Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు:
- సీనియర్ మేనేజర్ పోస్టులు: 3
- మేనేజర్ పోస్టులు: 4
- ఇంజినీర్ పోస్టులు: 2
- సీనియర్ కెమిస్ట్ పోస్టులు: 1
- అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు: 2
- ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫీసర్ పోస్టులు: 1
- మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 2
విభాగాలు: హెచ్‌ఆర్, ప్రొడక్షన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్, కెమికల్ ల్యాబ్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 33 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ. 40,000ల నుంచి రూ.2,20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎమ్మెస్సీ, సీఏ, ఎంబీబీఎస్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: పోస్టును బట్టి దరఖాస్తు రుసుము రూ.1000, రూ.700లు చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించాలి.
అడ్రస్: Dy. General Manager (HR), National Fertilizers Limited, A-11, Sector-24, Noida, District Gautam Budh Nagar, Uttar Pradesh – 201301.
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 5, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.