TSPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ పోస్టుల దరఖాస్తుకు నేటితో చివరి తేదీ. వెంటనే అప్లై చేసుకోండి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి విడుదల చేసిన జూనియర్ లెక్చరర్ పోస్టుల దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (జనవరి 10) ముగియనుంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 1392 పోస్టులను భర్తీ చేయనున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనుండడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీ పడే...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి విడుదల చేసిన జూనియర్ లెక్చరర్ పోస్టుల దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (జనవరి 10) ముగియనుంది. టీఎస్పీఎస్సీ ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 1392 పోస్టులను భర్తీ చేయనున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనుండడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీ పడే అవకాశం ఉంది. డిసెంబర్ 20వ తేదీన మొదలైన దరఖాస్తుల స్వీకరణ జవనరి 10వ తేదీతో ముగుస్తోంది. 2023 జూన్ లేదా జూలై నెలలో రాత పరీక్షను నిర్వహించనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
సబ్జెక్టు వారీగా భర్తీ చేయనున్న ఖాళీలు..
* అరబిక్ పోస్టులు: 2
* బోటనీ పోస్టులు: 113
* బోటనీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 15
* కెమిస్ట్రీ పోస్టులు: 113
* కెమిస్ట్రీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 19
* సివిక్స్ పోస్టులు: 56
* సివిక్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 1
* సివిక్స్ (మరాఠీ) పోస్టులు: 1
* కామర్స్ పోస్టులు: 50
* కామర్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 7
* ఎకనామిక్స్ పోస్టులు: 81
* ఎకనామిక్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 15
* ఇంగ్లిష్ పోస్టులు: 153
* ఫ్రెంచ్ పోస్టులు: 2
* హిందీ పోస్టులు: 117
* హిస్టరీ పోస్టులు: 77
* హిస్టరీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 17
* హిస్టరీ (మరాఠీ) పోస్టులు: 1
* మ్యాథమెటిక్స్ పోస్టులు: 154
* మ్యాథమెటిక్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 9
* ఫిజిక్స్ పోస్టులు: 112
* ఫిజిక్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 18
* సంస్కృతం పోస్టులు: 10
* తెలుగు పోస్టులు: 60
* ఉర్దూ పోస్టులు: 28
* జు వాలజీ పోస్టులు: 128
* జువాలజీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 18
అర్హతలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి..
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ అర్హత ఉండాలి. బీఏ, బీకామ్, బీఎస్సీ హానర్స్ డిగ్రీ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
* అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాలి. నిరుద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..