AP 10th Exams 2023: ఏప్రిల్ 19 నుంచి ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2023 ఏప్రిల్ 3 నుంచి 18 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. పరీక్షల మధ్యలో రంజాన్ పండగ సందర్భంగా ఏప్రిల్ 22న పరీక్ష ఉండదు. పరీక్షల అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనం..
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2023 ఏప్రిల్ 3 నుంచి 18 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. పరీక్షల మధ్యలో రంజాన్ పండగ సందర్భంగా ఏప్రిల్ 22న పరీక్ష ఉండదు. పరీక్షల అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 19 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సెక్రటరీ దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాల్లో ఎనిమిది రోజుల పాటు టెన్త్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక ఇప్పటికే పరీక్షలకు సంబంధించి ఫీజుల ప్రక్రియ కూడా ముగిసింది.
ఏ రోజున ఏ పరీక్ష ఉంటుందంటే..
- ఏప్రిల్ 3న ఫస్ట్ ల్యాంగ్వేజ్
- ఏప్రిల్ 6న సెకండ్ ల్యాంగ్వేజ్
- ఏప్రిల్ 8న ఇంగ్లిష్
- ఏప్రిల్ 10న మ్యాథమెటిక్స్
- ఏప్రిల్ 13న సైన్స్
- ఏప్రిల్ 15న సోషల్ స్టడీస్
- ఏప్రిల్ 17న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 1, ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 11
- ఏప్రిల్ 18న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2, ఎస్సెస్సీ ఒకేషనల్ కోర్స్
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.