ITI Limited Recruitment: ఐటీఐ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 80 వేలకిపైగా జీతం పొందే అవకాశం..

ITI Limited Recruitment: ఐటీఐ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ సంస్థ బెంగళూరు కేంద్రంగా విధులు నిర్వర్తిస్తోంది. నోటిఫికేషన్‌లో భాగంగా..

ITI Limited Recruitment: ఐటీఐ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 80 వేలకిపైగా జీతం పొందే అవకాశం..
Itc Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 05, 2021 | 8:10 PM

ITI Limited Recruitment: ఐటీఐ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ సంస్థ బెంగళూరు కేంద్రంగా విధులు నిర్వర్తిస్తోంది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 39 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా చీఫ్‌ మేనేజర్, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* డేటా సెంటర్‌, నెట్‌వర్క్‌, సెక్యూరిటీ, డేటా సెంటర్‌ అండ్‌ సేల్స్‌ మార్కెటింగ్, ఆర్‌ అండ్‌ డీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్, సీఏ/ ఐసీడబ్ల్యూ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* చీఫ్‌ మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 45 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైణ్‌ విధానంలో దరఖాస్తుచేసుకోవాలి.

* అభ్యర్థులను మొదట అకాడమీ, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* చీఫ్‌ మేనేజర్‌ పోస్టులకు ఎంపికై వారికి నెలు రూ. 80,240, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 65,195 అందిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 25-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* దరఖాస్తుల హార్డ్‌కాపీలను పంపడానికి 29-11-2021 చివరి తేదీ.

* హార్డ్‌ కాపీలను జనరల్‌ మేనేజర్‌-హెచ్‌ఆర్‌, ఐటీఐ లిమిటెడ్‌, ఐటీఐ భవన్‌ దూరవాణి నగర్‌, బెంగళూరు 560016 అడ్రస్‌కు పంపించాలి.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Puneeth Raj Kumar: తండ్రిని కలిసిన పునీత్.. కన్నీరు పెట్టిస్తున్న అందమైన పెయింటింగ్..

భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా మార్చిన కెప్టెన్.. ప్రస్తుతం ఆస్ట్రేలియా తరపున ఆడేందుకు రెడీ.. తొలి భారతీయుడిగా గుర్తింపు.. అతనెవరంటే?

Samantha: సమంత కొత్త గోల్స్… తన కొత్త ఆస్తి అదేనంటున్న ముద్దుగుమ్మ.. పోస్ట్ వైరల్..