Samantha: సమంత కొత్త గోల్స్… తన కొత్త ఆస్తి అదేనంటున్న ముద్దుగుమ్మ.. పోస్ట్ వైరల్..

సమంత.. ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం సమంత పేరు

Samantha: సమంత కొత్త గోల్స్... తన కొత్త ఆస్తి అదేనంటున్న ముద్దుగుమ్మ.. పోస్ట్ వైరల్..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 05, 2021 | 5:58 PM

సమంత.. ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం సమంత పేరు ఒక్కసారిగా తెగ వైరల్ అయ్యింది. అప్పటివరకు హీరోయిన్‏గా మూవీ అప్డేట్స్ మాత్రమే చూసే వాళ్లు.. సామ్ పై ఒక్కసారిగా తమ నెగిటివిటిని చూపించేశారు.. ఇక విడాకుల ప్రభావం.. సామ్ పై కాస్త ఎక్కువగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఆమె చేస్తున్న పోస్ట్స్ తన పరిస్థితిని వివరించేలా కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులు సమంత తన సోషల్ మీడియా ఖాతాలలో తెగ యాక్టివ్‏గా ఉంటోంది. తన బెస్ట్ ఫ్రెండ్స్‏తో కలిసి సరదాగా విదేశాలు చూట్టేస్తుంది. అలాగే పార్టీలకు వెళ్తుంది.

ఇక కొన్ని రోజులుగా తన ఇన్ స్టా స్టోరీలలో ఇంట్రెస్టింగ్ పోస్ట్స్ చేస్తున్న సమంత.. ఇప్పుడు మరో పోస్ట్ చేసింది. సంతోషమే అసలైన ఆస్తి.. మానసిక ప్రశాంతతే అసలైన విజయం.. ఆరోగ్యమే ఐశ్వర్యం..దయాగుణమే పరివర్తన అంటూ ఆసక్తికర పోస్ట్ చేసింది. ఇక తాజాగా నిన్న సమంత హైదారాబాద్‏లోని తన నివాసంలో దీపావళి సంబరాలు జరుపుకుంటుంది. మెగా కోడలు ఉపాసనతో కలిసి దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకుంది సమంత.. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి..

Sam

Sam

ఇదిలా ఉంటే.. సామ్… నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. అలాగే తమిళంలో ఓ మూవీ చేస్తుంది.  బాలీవుడ్ ఎంట్రీకి కూడా సన్నాహాలు చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

Also Read: Puneeth RajKumar: పునీత్ రాజ్ కుమార్‏కు సూర్య నివాళి.. అప్పు సమాధిని చూసి హీరో ఎమోషనల్..

RajiniKanth: తలైవా క్రేజ్ మాములుగా లేదు.. రజినీ సినిమా కోసం ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్..

Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…