భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా మార్చిన కెప్టెన్.. ప్రస్తుతం ఆస్ట్రేలియా తరపున ఆడేందుకు రెడీ.. తొలి భారతీయుడిగా గుర్తింపు.. అతనెవరంటే?
Unmukt Chand: ఈ ఆటగాడు తన కెప్టెన్సీలో భారత్‌కు అండర్-19 ప్రపంచకప్ అందించాడు. ఫైనల్‌లో అద్భుతమైన సెంచరీని సాధించాడు. ప్రస్తుతం ఈ ఆటగాడు ఆస్ట్రేలియా పిచ్‌లను షేక్ చేసేందుకు సిద్దంగా ఉన్నాడు.
Unmukt Chand: ఆస్ట్రేలియా టీ20 లీగ్- బిగ్ బాష్‌లో ఆడేందుకు భారతదేశానికి చెందిన ఒక పురుష క్రికెటర్ మొదటిసారిగా సంతకం చేశాడు. ఆ క్రికెటర్ పేరు ఉన్ముక్త్ చంద్. ఉన్ముక్త్ చంద్ కొన్ని నెలల క్రితమే భారత్ వదిలి అమెరికా చేరుకున్నాడు. ఇప్పుడు బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతూ కనిపించనున్నాడు. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ ఉన్ముక్త్ చంద్‌ను ఎంపిక చేసింది. భారత్ నుంచి ఈ లీగ్‌లో ఆడనున్న తొలి పురుష క్రికెటర్‌గా నిలిచాడు. బిగ్ బాష్ లీగ్‌లో భారత మహిళా క్రీడాకారులు నిరంతరం ఆడుతున్నా, భారత్‌కు చెందిన ఓ పురుష క్రికెటర్ ఈ లీగ్‌లో ఆడడం ఇదే తొలిసారి.
భారత పురుష ఆటగాళ్లు మరే ఇతర విదేశీ లీగ్‌లో ఆడేందుకు అనుమతించనప్పటికీ, ఉన్ముక్త్ చంద్ భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికి అమెరికా చేరుకున్నాడు. అందుకే బీబీఎల్‌లో ఆడేందుకు అతనికి స్వేచ్ఛ దొరికింది. ఈమేరకు ఉన్ముక్త్ చంద్ ఓ ట్వీట్ కూడా చేశాడు. “నిజాయితీగా చెప్పాలంటే, ఇది అంత తేలికైన నిర్ణయం కాదు. నేను మళ్లీ నా దేశం తరఫున ఆడలేనన్న వాస్తవాన్ని అంగీకరించడం చాలా కష్టమైంది. కానీ, నేను అమెరికాతో ఆడటం ఆనందిస్తున్నాను. నా ఆట ప్రతిరోజూ మెరుగుపడుతోంది. నేను ఇప్పుడు ప్రతి లీగ్‌లో ఆడగలను. ఇది నాకు పెద్ద విజయం’ అంటూ ట్వీట్ చేశాడు.
బీబీఎల్‌లో ఆడాలని ఎప్పుడూ కోరుకుంటానని ఉన్ముక్త్ తెలిపాడు. అతను మాట్లాడుతూ, “నేను బిగ్ బాష్ లీగ్‌ని చూడాలనుకుంటున్నాను. ప్రపంచం నలుమూలల నుంచి ఆటగాళ్లు ఉన్నారు. ఇవి గొప్ప వేదికలు. నాకు ఎప్పుడూ ఇక్కడ ఆడాలని ఉండేది. రాబోయే కాలంలో నా పేరు సంపాదించడానికి, నేను ఆడే జట్టుకు ఛాంపియన్‌షిప్ సాధించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. మెల్‌బోర్న్ జట్టుకు ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఆస్ట్రేలియాలో ఆడేందుకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను. నేను ఇంతకు ముందు మెల్‌బోర్న్‌లో నివసించలేదు. ఇక్కడ చాలా మంది భారతీయులు ఉన్నారని నాకు తెలుసు. కాబట్టి అది బాగానే ఉంటుంది. ప్రేక్షకులు మ్యాచ్‌లకు వస్తారని ఆశిస్తున్నా’’ అని తెలిపాడు.
అండర్-19 ప్రపంచకప్ గెలిచింది 2012లో ఉన్ముక్త్ చంద్ సారథ్యంలో భారత్ అండర్-19 ప్రపంచకప్ గెలిచింది. ఫైనల్‌లో సెంచరీ సాధించాడు. ఆ సమయంలో భారత్‌కు తదుపరి విరాట్ కోహ్లి అని పేరుగాంచాడు. కానీ అపరిమితంగా ఉన్న అంచనాలను అందుకోలేకపోయాడు. అతను జాతీయ జట్టుకు ఎప్పుడూ ఆడలేదు. అతను ఐపీఎల్‌లో ఢిల్లీ, ముంబై, రాజస్థాన్ ఫ్రాంచైజీల తరఫున కూడా ఆడాడు. కానీ, విజయవంతం కాలేదు. దీంతో అతని కెరీర్ క్రమంగా పడిపోయింది. తన సొంత రాష్ట్రం ఢిల్లీని విడిచిపెట్టి, ఉత్తరాఖండ్ తరపున కూడా ఆడాడు. ఆ తరువాత తిరిగి ఢిల్లీకి వచ్చాడు. కానీ, ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత అతనికి ఆడే అవకాశం రాకపోవడంతో భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు అతను బీబీఎల్‌లో ఆడబోతున్నాడు. అతని రాక తర్వాత, ఈ లీగ్‌లో మిగిలిన భారత ఆటగాళ్లు కూడా ఆడటం చూడొచ్చేమో.
Also Read: World Cup: ఈ ఆటగాడి కారణంగా భారత్ ప్రపంచకప్ ఆశలు గల్లంతు.! అతడెవరో తెలుసా.?