World Cup: ఈ ఆటగాడి కారణంగా భారత్ ప్రపంచకప్ ఆశలు గల్లంతు.! అతడెవరో తెలుసా.?
టీమిండియాకు ప్రధాన బలం స్పిన్. స్వదేశీ పిచ్‌లైనా, విదేశీ పిచ్‌లైనా ప్రత్యర్ధులను స్పిన్‌తో బెంబేలెత్తిస్తుంది. ఇలా ఎన్నో బలమైన జట్లకు స్పిన్‌తో...
టీమిండియాకు ప్రధాన బలం స్పిన్. స్వదేశీ పిచ్‌లైనా, విదేశీ పిచ్‌లైనా ప్రత్యర్ధులను స్పిన్‌తో బెంబేలెత్తిస్తుంది. ఇలా ఎన్నో బలమైన జట్లకు స్పిన్‌తో టీమిండియా షాక్ ఇచ్చింది. టీమిండియా తన స్పిన్ బలంతో ఎన్నో బలమైన జట్లను దెబ్బకొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కుని ఎందరో బ్యాట్స్‌మెన్లు భారత్‌కు చుక్కలు చూపించారు. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి 1987లో చోటు చేసుకుంది. ఆ ఏడాది జరిగిన రిలయన్స్ ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో ఓ ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టే సెంచరీ చేసి.. టోర్నమెంట్ నుంచి టీమిండియా నిష్క్రమణకు కారకుడయ్యాడు. అతడెవరో కాదు ఓపెనర్ గ్రాహం గూచ్. ఇక ఆ మ్యాచ్ 1987వ సంవత్సరం నవంబర్ 5(ఈ రోజున) జరిగింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత కెప్టెన్ కపిల్ దేవ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. కపిల్ దేవ్, మనోజ్ ప్రభాకర్, చేతన్ శర్మ వంటి సీమర్ల బౌలింగ్‌ను ఆచితూచి ఆడిన గ్రాహం గూచ్.. శాస్త్రి-మనీందర్ సింగ్‌ల స్పిన్ బౌలింగ్‌లో స్వీప్ షాట్స్‌తో అలరించాడు. గూచ్ మొత్తంగా 136 బంతులు ఆడి 84.56 స్ట్రైక్ రేట్‌తో 115 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు ఉన్నాయి. గూచ్‌కు కెప్టెన్ మైక్ గాటింగ్(56) సహకారం అందించడంతో ఇంగ్లాండ్ స్కోర్ నిర్ణీత ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 254 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మనీందర్ సింగ్ 3 వికెట్లు తీయగా.. కపిల్ దేవ్ 2 వికెట్లు, చేతన్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు.
అజహర్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్లు నిరాశపరిచారు…
లక్ష్యచేధనలో భాగంగా బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా బ్యాట్స్‌మెన్లు పూర్తిగా నిరాశపరిచారు. మొహమ్మద్ అజారుద్దీన్(64) మినహా.. మిగిలిన ఎవ్వరూ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడలేదు. క్రిస్ శ్రీకాంత్(31), కపిల్ దేవ్(30) రాణించగా.. నిర్ణీత ఓవర్లలో భారత్ 219 పరుగులకు కుప్పకూలింది. దీనితో 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌తో భారత్.. ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది.
కాగా, ఈ మ్యాచ్ సునీల్ గవాస్కర్ కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఇందులో కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఎడ్డీ హెమింగ్స్ నాలుగు వికెట్లు తీయగా, నీల్ ఫోస్టర్ మూడు వికెట్లు పడగొట్టారు. చివరికి ఫైనల్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తలబడగా.. ఆసీస్ ప్రపంచకప్ ట్రోఫీని గెలుపొందింది.
Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు
ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??