Indian Oil: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పదో తరగతి, ఇంటర్, డిగ్రీతో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..!
Indian Oil Corporation: దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో ఆయా రంగాలలో..
Indian Oil Corporation: దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో ఆయా రంగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నాయి. ఇక తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) రిఫైనరీస్ విభాగంలో ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగ పోస్టులకు దరఖాస్తులకు నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా1968 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది.
ఇందులో భాగంగా కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సెక్రటేరియల్ అసిస్టెంట్, అకౌంటెంట్ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగలకు సంబంధించి అభ్యర్థులను రాతపరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తులను 2021 నవంబర్ 12వ తేదీ వరకు. ఈ ఉద్యోగ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వెబ్‌సైట్‌సందర్శించి తెలుసుకోవచ్చ. ఇందులో మొత్తం ఉద్యోగ పోస్టుల సంఖ్య 1968. ట్రేడులను పరిశీలిస్తే.. మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సెక్రటేరియల్ అసిస్టెంట్, డీఈఓ, అకౌంటెంట్ తదితర పోస్టులు ఉన్నాయి.
► అర్హత: పదో తరగతి, ఇంటర్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఏ/బీఎస్సీ/బీకాం ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ► వయసు: 2021 అక్టోబర్ 31 నాటికి 18 నుంచి 24 సంవత్సరాలు ఉండాలి. ► ఎంపిక విధానం: రాతపరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ► ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ: నవంబర్ 12 ► రాతపరీక్ష తేది: నవంబర్ 21, 2021 ► వెబ్‌సైట్: https://www.iocl.com/