ITBP Constable Jobs 2022: చివరి అవకాశం! ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. త్వరలో ముగుస్తున్న దరఖాస్తులు..

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ITBP)లో 52 కానిస్టేబుల్‌ పోస్టులకు (Constable Posts) ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మరికొన్ని రోజుల్లో ముగియ..

ITBP Constable Jobs 2022: చివరి అవకాశం! ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. త్వరలో ముగుస్తున్న దరఖాస్తులు..
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 18, 2022 | 7:25 AM

ITBP Police Constable Recruitment 2022: భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ITBP)లో 52 కానిస్టేబుల్‌ పోస్టులకు (Constable Posts) ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులనకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే అభ్యర్ధుల వయసు సెప్టెంబర్‌ 17, 2022 నాటికి 18 నుంచి 25 యేళ్ల మధ్య ఉండాలి. సెప్టెంబర్‌ 28, 1997 ముందు, సెప్టెంబర్‌ 27, 2004 తర్వాత జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు వయోపరిమితి విషయంలో రిజర్వేషన్‌ వర్తిస్తుంది. ఈ అర్హతలున్నవారు సెప్టెంబర్‌ 27, 2022వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.100లు దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్‌/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. నోటిఫికేషన్‌లో సూచించిన విధంంగా ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.