Indian Navy Recruitment: ఐటీఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇండియన్ నేవీలో ట్రేడ్స్‌మెన్ పోస్టులు..
Indian Navy Recruitment: ఇండియన్ నేవీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా ట్రేడ్స్‌మెన్ స్కిల్డ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Indian Navy Recruitment: ఇండియన్ నేవీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా ట్రేడ్స్‌మెన్ స్కిల్డ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం…
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు…
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 1531 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో గ్రూప్‌సీ, నాన్ గెజెటెడ్ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లిష్‌లో కనీస పరిజ్ఞానం తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు 25 ఏళ్లు మించకూడదు..
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 22న ప్రారంభమవుతుండగా, మార్చి 31ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Etharkkum Thunindhavan: యాక్షన్ ఎంటర్టైనర్‌గా రానున్న ‘ఇతరుక్కుమ్ తునింధవన్’.. అదిరిపోయిన టీజర్
AP CM Jagan: ఈ నెల 20వ తేదీన వైఎస్సార్ కడప, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్న సీఎం జగన్
Viral: పెయిడ్ లీవ్ కోసం పెద్ద నాటకమే వేసింది.. నిజం తెలిసి ఉన్నతాధికారుల మైండ్ బ్లాంక్ అయ్యింది