Viral: పెయిడ్ లీవ్ కోసం పెద్ద నాటకమే వేసింది.. నిజం తెలిసి ఉన్నతాధికారుల మైండ్ బ్లాంక్ అయ్యింది
ఆమె ప్రభుత్వ ఉద్యోగిణి.. మంచి జీతం.. హోదా ఉన్న పోస్ట్. వయస్సు 43 సంవత్సరాలు. అయితే సెలవలు కోసం ఆమె చేసిన పని మాత్రం ఇప్పుడు చర్చనీయాశంమైంది.
Trending News: ఆమె ప్రభుత్వ ఉద్యోగిణి.. మంచి జీతం.. హోదా ఉన్న పోస్ట్. వయస్సు 43 సంవత్సరాలు. అయితే సెలవలు కోసం ఆమె చేసిన పని మాత్రం ఇప్పుడు చర్చనీయాశంమైంది. జాబ్‌కే ఎసరు వచ్చింది. ఇంతకీ ఆమె చేసిన ఆ తింగరి పని ఏంటో తెలుసుకుందాం పదండి. జార్జియా వొకేషనల్ రీహాబిలిటేషన్ ఏజెన్సీ (GVRA)కి కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేసిన రాబిన్ ఫోల్సమ్ పెయిడ్ మెటర్నిటీ లీవ్ కోసం ఫేక్ ప్రెగ్నన్సీ నాటకానికి తెరతీసింది. ఏకంగా నకిలీ బేబీ బంప్‌తో ఆఫీసుకు వెళ్లి సెలవలు కావాలని కోరింది. 2020 అక్టోబర్‌లో తాను ప్రెగ్నంట్ అని హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌కు చెప్పింది.. 2021 మేలో ప్రసవించినట్లు వెల్లడించింది. ఓ వ్యక్తితో భర్తలా ఉన్నతాధికారులకు ఈ మెయిల్ పెట్టించింది. దీంతో అనేక వారాల వేతనంతో కూడిన సెలవులను ఇచ్చారు. తన బిడ్డ అంటూ ఆమె పలు ఫోటోలను కొలిగ్స్‌కు పంపింది. ఆ ఫోటోలు కాస్త తేడాగా అనిపించాయి. ఈ క్రమంలోనే ఒక సహోద్యోగికి అనుమానం వచ్చి.. ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం వెలుగుచూసింది. తాను బిడ్డకు జన్మనిచ్చినట్లు సరైన ఆధారాలు సమర్పించకపోవడంతో.. ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. చీటింగ్, తప్పడు ప్రకటనలు నేపథ్యంలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. దోషిగా తేలితే గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు/లేదా 100,000 డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది.
Also Read: Andhra Pradesh: మూడు కాళ్లతో వింత కోడిపిల్ల.. ఎంత ముచ్చటగా ఉందో చూడండి