Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine’s Day: లైవ్‌ షోలో న్యూస్ రీడర్‌కు మ్యారేజ్‌ ప్రపోజల్‌.. ఆనందంతో అమ్మాయి షాక్‌..

Valentine's Day:కొంతకాలంగా ప్రేమలో ఉన్న తమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకోవడానికి ప్రేమికుల రోజుని ఎంచుకున్నాడు. తనకు అమ్మాయి పై ఉన్న ప్రేమను వ్యక్తం చెయ్యడానికి..

Valentine's Day: లైవ్‌ షోలో న్యూస్ రీడర్‌కు మ్యారేజ్‌ ప్రపోజల్‌.. ఆనందంతో అమ్మాయి షాక్‌..
Romantic Marriage Proposal
Follow us
Surya Kala

|

Updated on: Feb 18, 2022 | 6:15 PM

Valentine’s Day:కొంతకాలంగా ప్రేమలో ఉన్న తమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకోవడానికి ప్రేమికుల రోజుని ఎంచుకున్నాడు. తనకు అమ్మాయి పై ఉన్న ప్రేమను వ్యక్తం చెయ్యడానికి ఓ వ్యక్తి టీవీ లైవ్‌ షో ను వేదికగా చేసుకున్నాడు. టీవీ లైవ్ వస్తున్నప్పుడే పెళ్లిచేసుకుందామా(Marriage Proposal) అని అడిగేశాడు. తండ్రి ప్రేమను తెలియజెడానికి అతని ఇద్దరు కూతుళ్లు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. దీంతో ఆ యువతి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోయింది. అమెరికా… శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ ఘటన జరిగింది. ఓ ప్రముఖ ఛానెల్‌లో వాతావరణ వార్తలు చదువుతోంది. ఆమె వార్తలు అలా లైవ్ లో చెబుతుండగా… ఇద్దరు అమ్మాయిలు రెండు గులాబీ పూలను తెచ్చి ఆమెకు ఇచ్చారు. వాటిని చూడగానే ఆమె పరమానందం చెందింది. అంతలోనే ఆమె బాయ్ ఫ్రెండ్ పూలగుత్తితో ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికప్పుడే తన ప్రేమను వ్యక్తం చేస్తూ… నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ రింగ్ బయటకు తీశాడు. మోకాళ్లపై కూర్చొని మ్యారేజ్ ప్రపోజల్‌ని ఆమె ముందు పెట్టాడు. దాంతో ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది.

అయితే వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. కలిసి మెలిసి తిరుగుతున్నారు. వారిద్దరూ కలిసి తిరిగిన ప్రదేశాల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కాగా అతనికి ఇదివరకే పెళ్లైంది. స్టూడియోలో గులాబీలు ఇచ్చిన ఇద్దరు అమ్మాయిలూ… అతని కూతుర్లు. వాళ్లిద్దరూ స్టూడియోకి వచ్చినప్పుడు ఫ్యామిలీ విజిట్ అనుకున్న యువతి… మ్యారేజ్ ప్రపోజల్ తేగానే ఆశ్చర్యపోయింది. ఇదంతా చూసిన అభిమానులు, ఫ్రెండ్స్‌ నుంచి ఆమెకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. తనకు విష్ చేసే అందరికీ థాంక్స్ అంటూ ఆమె ట్విట్టర్ లోని తన అకౌంట్‌లో ట్వీట్ చేసింది. దాంతో ఇది కాస్తా వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు.”ఎంత ప్రత్యేకం .. ఈ రోజు నీకు అత్యంత బాగా గుర్తుండిపోయే రోజు. నీకు బెస్ట్ విషెస్” అని ఒకరు తెలపగా… “లవ్లీ ప్రపోజల్. శుభాకాంక్షలు. ఆ పిల్లలు కూడా ఎంతో థ్రిల్ ఫీలయ్యారు” అని మరో యూజర్ తెలిపారు. కాగా ఇదంతా అనుకోకుండా, తనకు ఏమాత్రం తెలియకుండా జరిగిందన్న మేరీ… ఇలా జరుగుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని తెలిపింది. ఇక తాము పెళ్లికి ప్లాన్ చేసుకుంటామని చెప్పింది.

Also Read:

ఇకపై ఆ దేశంలోనూ యూపీఐ సేవలు.. భారత్‌ వెలుపల యూపీఐ ఉపయోగిస్తున్న తొలి దేశం..