Pushpa Song: ఆకుపచ్చని సీతాకోక చిలుకల్లా తల్లీకూతురు.. పుష్పలోని శ్రీవల్లి సాంగ్స్‌కు డ్యాన్స్..
Pushpa Song: అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప సినిమా ఫీవర్ ఇంకా కొనాగుతూనే ఉంది. సోషల్ మీడియా(Social Media)లో పుష్ప సినిమాలోని సాంగ్స్ కు సంబంధించిన ఒక్క కొత్త పోస్టు..
Pushpa Song: అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప సినిమా ఫీవర్ ఇంకా కొనాగుతూనే ఉంది. సోషల్ మీడియా(Social Media)లో పుష్ప సినిమాలోని సాంగ్స్ కు సంబంధించిన ఒక్క కొత్త పోస్టు అయినా దర్శనమిస్తుంది. ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ విదేశాల సంగీత అభిమానులను అలరిస్తోంది. అల్లు అర్జున్ హుక్ స్టెప్ తో పాటు, శ్రీ వల్లి సాంగ్ కు సంబంధించిన రీల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఓ తల్లి కూతురు శ్రీవల్లి సాంగ్ కు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోలో తల్లి , కుమార్తె సాంప్రదాయ దుస్తులైన లంగా,వోణీ వేసుకుని.. అందమైన స్టెప్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఈ వీడియో నివేదితాశెట్టి ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయబడింది. తల్లి , ఆమె కుమార్తె ఒకే విధమైన దుస్తులను ధరించడమే కాదు.. ఇద్దరూ కలిసి అద్భుతమైన కో ఆర్డినేషన్ తో డ్యాన్స్ చేశారు. శ్రీవల్లి సాంగ్ కు హుక్ స్టెప్ కి సంప్రదాయ నాట్యాన్ని మిళితం చేసి అద్భుతంగా డ్యాన్స్ చేశారు. కొన్ని రోజుల క్రితం వీడియో పోస్ట్ చేయబడింది. ఇప్పటి వరకూ ఈ క్లిప్ 18,000 కంటే ఎక్కువ లైక్స్ ను సొంతం చేసుకుంది. సో క్యూటీ , మీరు ఇద్దరూ అద్భుతం వంటి అనేక రకాల కామెంట్స్ ను సొంతం చేసుకుంది ఈ వీడియో..
View this post on Instagram
Also Read: శాస్త్రజ్ఞుల కంట పడిన అరుదైన దెయ్యం షార్క్ చేప.. పరిశోధన చేయాల్సి ఉందన్న సైంటిస్టులు