UPI: ఇకపై ఆ దేశంలోనూ యూపీఐ సేవలు.. భారత్ వెలుపల యూపీఐ ఉపయోగిస్తున్న తొలి దేశం..
UPI: భారత్‌లో డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించడానికి రూపొందించిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ఎంతలా సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ చిన్న అవసరానికైనా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది...
UPI: భారత్‌లో డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించడానికి రూపొందించిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ఎంతలా సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ చిన్న అవసరానికైనా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. మెజారిటీ లావాదేవీలు యూపీఐ విధానంలో సాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు భారత్‌కే పరిమితమైన ఈ సేవలు మరో దేశంలోకి కూడా అందుబాటులోకి రానున్నాయి. యూపీఐ వాడుతోన్న తొలి భారత్ వెలుపలి దేశంగా నేపాల్ స్థానం దక్కించుకుంది. డిజిటల్ ఎకానమీకి ఊతమిచ్చేందుకు గాను నేపాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నేపాల్‌లో యూపీఐ సేవలు అందించేందుకు భారత జాతీయ చెల్లింపుల సంస్థ ఎన్‌పీసీఐ (NPCI), గేట్‌వే పేమెంట్స్ సర్వీస్ (GPS), మనం ఇన్ఫోటెక్ చేతులు కలిపాయి.
ఈ విషయమై గేట్‌వే పేమెంట్స్ సర్వీస్ సీఈఓ రాజేశ్ ప్రసాద్ మనన్‌దార్ మాట్లాడుతూ.. ‘భారత్, నేపాల్‌లోని ప్రజలు పర్సన్ టు పర్సన్ విధానంలో లావాదేవీలు చేసుకొవచ్చు. నేపాల్‌లో డిజిటల్ పేమెంట్స్‌కు ఇది చేయూతనిస్తుంది. నేపాల్‌లోని మారుమూల గ్రామాల్లోని ప్రజలు కూడా ఈ సేవలను పొందవచ్చు. భారత్‌లో డిజిటల్ సేవలకు యూపీఐ సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి’ అని చెప్పుకొచ్చారు.
ఇక నేపాల్‌లో యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయమై భారత జాతీయ చెల్లింపు సంస్థ ఎన్‌పీసీఐ.. ‘భారత్ వెలుపల యూపీఐ వ్యవస్థను అమలు చేయనున్న తొలి దేశం నేపాల్. దేశాన్ని డిజిటల్ ఎకానమీ వైపు తీసుకెళ్లాలనుకుంటున్న నేపాల్ ప్రభుత్వ ఆలోచనకు ఈ చెల్లింపు వ్యవస్థ దోహదపడుతుంది’ అని ప్రకనటలో తెలిపింది.
Also Read: మాయమాటలు చెప్పి.. కొండపైకి తీసుకెళ్లారు.. ఎవరూ లేని సమయంలో..??
Aakash Puri’s Chor Bazaar: రామ్ పోతినేని వదిలిన ‘చోర్ బజార్’ టైటిల్ సాంగ్.. దొంగగా ఆకాష్ పూరి
Dallas: అగ్రరాజ్యంలోనూ అడుగు పెట్టిన కోడిపందాలు.. 133 కోళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు