AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithya Menen: ఆహా కోసం రంగంలోకి దిగనున్న టాలెంటెడ్ హీరోయిన్..ఆ షో కోసమేనా.?

వందశాతం తెలుగు కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. సూపర్ హిట్ సినిమాలతో పాటు అదిరిపోయే టాక్ షోలతో అలరిస్తుంది ఆహా.

Nithya Menen: ఆహా కోసం రంగంలోకి దిగనున్న టాలెంటెడ్ హీరోయిన్..ఆ షో కోసమేనా.?
Nithya Menon
Rajeev Rayala
|

Updated on: Feb 18, 2022 | 4:05 PM

Share

Aha: వందశాతం తెలుగు కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. సూపర్ హిట్ సినిమాలతో పాటు అదిరిపోయే టాక్ షోలతో అలరిస్తుంది ఆహా. ప్రతి వారం సరికొత్త కంటెంట్ అప్లోడ్ చేయడమే కాకుండా.. ఇతర భాషల్లోని సినిమాలను సైతం తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంలో నెంబర్ వన్ దిశగా దూసుకుపోతుంది ఆహా. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ సంచలన రికార్డ్స్ క్రియేట్ చేసింది. బాలకృష్ణను సరికొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేసింది ఆహా. సినిమాతారలతో తనదైన స్టైల్ లో బాలయ్య చేసిన సందడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఆహా మరో అడుగు ముందుకు వేసి ఇండియన్ ఐడల్ తో రెడీ అవుతుంది. బాలీవుడ్లో సూపర్ హిట్ అయినా ఈ సింగింగ్ కాంపిటేషన్ ను ఇప్పుడు ఆహా తెలుగులోకి తీసుకురానుంది. అద్భుతమైన గాత్రంతో ఆకట్టుకునే సింగర్స్ ను ఇప్పుడు ఆహా వేదికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.

తెలుగు ఇండియన్ ఐడల్ కు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ జడ్జ్ గా వ్యవహరించనున్నారు. అయితే మరొక జడ్జ్ గా ఓ అందాల భామను ఎంపిక చేశారని తెలుస్తుంది. ఈ షోకు న్యాయ నిర్ణేతగా టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ ను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తుంది. నిత్యా హీరోయిన్ గానే కాకుండా సింగర్ గాను తన ప్రతిభను చాటుకున్న విషయం తెలిసిందే. పలు సినిమాల్లో తన అందమైన గాత్రాన్ని వినిపించింది. ఇక ఈ షో హోస్టింగ్ బాధ్యతలను ఇండియన్ ఐడిల్ విజేత, ప్రముఖ సింగర్ శ్రీరామ చంద్రకు అప్పగించారు. అలాగే నిత్యామీనన్ కు సంబంధించిన ప్రోమో త్వరలోనే విడుదల చేస్తారని తెలుస్తుంది. హీరోయిన్ గా నిత్యామీనన్ తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తుంది. తెలుగులో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా నటిస్తున్న భీమ్లానాయక్ సినిమాలో పవన్ భార్యగా కనిపించనుంది నిత్యామీనన్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: బోసి నవ్వులు.. చక్కనైన చెక్కిళ్లు.. ఈ క్యూట్ బుజ్జాయి ఎవరో చెప్పండి? అబ్బాయిల డ్రీమ్ గర్ల్!

Son Of India Review: చెడును స‌హించ‌ని స‌న్నాఫ్ ఇండియా.. తగ్గని డైలాగ్ కింగ్ ఎనర్జీ..

Anupama Parameswaran: అందాల ముద్దుగుమ్మ సీతాకోక చిలుకగా మారితే.. ఆకట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ న్యూలుక్..