Aha OTT : కల్ట్ మూవీ ‘96’ తెలుగు వర్షన్ వచ్చేసింది.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమా

100 శాతం తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’ ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటూ.. ప్ర‌తి శుక్ర‌వారం కొత్త రిలీజ్‌తో తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.

Aha OTT : కల్ట్ మూవీ ‘96’ తెలుగు వర్షన్ వచ్చేసింది.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమా
Vijay Sethupathi , Trisha,
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 18, 2022 | 4:33 PM

Aha OTT : 100 శాతం తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’ ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటూ.. ప్ర‌తి శుక్ర‌వారం కొత్త రిలీజ్‌తో తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 18)న‌ ‘ఆహా’లో కల్ట్ మూవీ ‘96’ విడుదలైంది. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక తెలుగు సినీ ప్రేక్షకుడు సంతోషపడుతున్నాడు. తమిళ చిత్రమైన ‘96’ను తెలుగులో అనువదించిన మన ప్రేక్షకులకు అందించడంతో ఆహాపై తెలుగు ప్రేక్షకులకు ప్రశంసలు కురిపిస్తున్నారు. తమిళ్  సినిమా అయిన 96 అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. ఈ  సినిమాలో త్రిష , విజయ్ సేతుపతి హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా అద్భుతమైన విజయంతోపాటు పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంది.

ఆహా’ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ విషయానికి వస్తే .. అర్జున ఫ‌ల్గుణ‌, హే జూడ్‌, ది అమెరిక‌న్ డ్రీమ్‌, ల‌క్ష్య, సేనాప‌తి, త్రీ రోజెస్‌, లాభం, మంచి రోజులొచ్చాయి, రొమాంటిక్‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, అనుభ‌వించు రాజా, స‌ర్కార్‌, ఛెఫ్ మంత్ర‌, అల్లుడుగారు, క్రిస్‌మ‌స్ తాత వంటివ‌న్నీ ప్ర‌స్తుతం ఆహాలో ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతున్న‌వే. నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేసిన అన్‌స్టాప‌బుల్ షోను ఐఎండీబీ నెంబ‌ర్ ఒన్ టాక్ షో గా గుర్తించిన విష‌యం తెలిసిందే. అలాగే తెలుగు పాట‌కు ప్ర‌పంచ‌లోనే అతి పెద్ద వేదిక అయిన ఇండియ‌న్ ఐడ‌ల్ కార్య‌క్ర‌మాన్ని ఆహా ప్రీమియ‌ర్‌గా ఫిబ్ర‌వ‌రి 25 నుంచి అల‌రించ‌నుంది. శ్రీరామ చంద్ర ఈ కార్య‌క్ర‌మాన్ని హోస్ట్ చేస్తున్నారు. అలాగే న్యాయ నిర్ణేతగా మ్యూజిక్ సెన్సేషన్ తమన్ వ్యవహరించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: బోసి నవ్వులు.. చక్కనైన చెక్కిళ్లు.. ఈ క్యూట్ బుజ్జాయి ఎవరో చెప్పండి? అబ్బాయిల డ్రీమ్ గర్ల్!

Son Of India Review: చెడును స‌హించ‌ని స‌న్నాఫ్ ఇండియా.. తగ్గని డైలాగ్ కింగ్ ఎనర్జీ..

Anupama Parameswaran: అందాల ముద్దుగుమ్మ సీతాకోక చిలుకగా మారితే.. ఆకట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ న్యూలుక్..