AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dallas: అగ్రరాజ్యంలోనూ అడుగు పెట్టిన కోడిపందాలు.. 133 కోళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

Dallas: సంక్రాంతి(Pongal) సంబరాల్లో గ్రామీణులకు సంప్రదాయ ఆట కోడి పందాలు(Cockfight). రెండు పందెం కోళ్ళ మధ్య తెలుగు ప్రజలు నిర్వహించే క్రీడ. ఈ కోడి పందాలు గత కొన్నేళ్ల..

Dallas: అగ్రరాజ్యంలోనూ అడుగు పెట్టిన కోడిపందాలు.. 133 కోళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
Dallas Cock Fight
Surya Kala
|

Updated on: Feb 18, 2022 | 3:05 PM

Share

Dallas: సంక్రాంతి(Pongal) సంబరాల్లో గ్రామీణులకు సంప్రదాయ ఆట కోడి పందాలు(Cockfight). రెండు పందెం కోళ్ళ మధ్య తెలుగు ప్రజలు నిర్వహించే క్రీడ. ఈ కోడి పందాలు గత కొన్నేళ్ల క్రితం వరకూ ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే కనిపించే సాంప్రదాయక సందడి. కాలక్రమంలో ఈ కోడి పందాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు.. తెలంగాణ , తమిళనాడు, కేరళ వంటి  రాష్ట్రాల్లో  భారీ ఎత్తున ఈ కోడి పందాలను ప్రతి ఏటా సంప్రదాయంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కోడి పందాలు మనదేశం దాటి.. అగ్రరాజ్యం అమెరికాలో కూడా అడుగు పెట్టాయి.

తాజాగా డల్లాస్ లో కోడిపందాల కోసం ఉపయోగించే 133 కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. టెక్సాస్‌లో కోడి పందాలు జరుగుతున్నాయనే సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకొని.. అక్కడ 123 పందెం కోడి పుంజులను, 8 కోళ్ల ఓతో పాటు రెండు చనిపోయిన కోడి పుంజులను అదుపులోకి తీసుకున్నారు.  పోలీసులు, టెక్సాస్‌కు చెందిన SPCA అధికారులు కోడిపందాల జరుగుతున్న స్థలం నుండి మొత్తం 133 పక్షులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం  డల్లాస్‌లో ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని అధికారులు శనివారం తెలిపారు.

గార్డెన్ గ్రోవ్ డ్రైవ్‌లోని 11700 బ్లాక్‌లో భారీగా కోడి పందాలు జరుగుతున్నాయని.. గుర్తు తెలియని వ్యక్తి..  911 కాల్ చేశాడని.. పందెం జరుగుతున్న ప్రాంతంలో దాదాపు  200 మంది ఉన్నారని ఆ వ్యక్తి చెప్పాడని పోలీసులు చెప్పారు.

అయితే మన రాష్ట్రంలో.. కోడి పందాలు జూద క్రీడగా మారుతూ వస్తున్నందున జంతు, వన్య ప్రాణి సంరక్షణ చట్టం మేరకు కోడి పందాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదన్న సంగతి తెలిసిందే.

Also Read:

రామ్ పోతినేని వదిలిన ‘చోర్ బజార్’ టైటిల్ సాంగ్.. దొంగగా ఆకాష్ పూరి

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి