NIT Recruitment: వరంగల్‌ ఎన్‌ఐటీలో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

NIT Recruitment: వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖకి చెందిన ఈ విద్యా సంస్థలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు...

NIT Recruitment: వరంగల్‌ ఎన్‌ఐటీలో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Nit Warangal
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 18, 2022 | 5:05 PM

NIT Recruitment: వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖకి చెందిన ఈ విద్యా సంస్థలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 99 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రొఫెసర్‌ (29), అసోసియేట్‌ ప్రొఫెసర్‌ (50), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌1 (12), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌ 2 (08) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్‌/పీజీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 21-02-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Chanakya Niti: పిల్లల ముందు తల్లిదండ్రులు ఈ నాలుగు విషయాలను గుర్తు పెట్టుకుని మెలగాలంటున్న చాణక్య..

అర్థరాత్రి హడలెత్తించిన వింత జీవి..!

Viral Video: పిల్ల అయినా పులి పులే.. తల్లిని వణికించిన బుజ్జి పులి.. నవ్వులు పూయిస్తోన్న వీడియో..