Chanakya Niti: పిల్లల ముందు తల్లిదండ్రులు ఈ నాలుగు విషయాలను గుర్తు పెట్టుకుని మెలగాలంటున్న చాణక్య..
Chanakya Niti: ఆచార్య చాణుక్యుడు(Acharya Chanakya) గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు, సామాజిక శాస్త్రం మొదలైన అన్ని విషయాలపై ఆయనకు లోతైన..
Chanakya Niti: ఆచార్య చాణుక్యుడు(Acharya Chanakya) గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు, సామాజిక శాస్త్రం మొదలైన అన్ని విషయాలపై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉంది. చాణక్యుడి తన జీవిత సారాన్ని, అనుభవాలను నీతి శాస్త్రంలో పొందుపరిచాడు. చాణుక్యుడు ఏదైనా పరిస్థితిని ముందుగానే ఊహించి, దానిని ఎదుర్కోవటానికి వ్యూహాన్ని సిద్ధం చేసేవాడు. ఆచార్య చాణుక్యుడు తన తెలివి తేటలతో రాజవంశాన్ని నాశనం చేసి మౌర్య రాజవంశాన్ని స్థాపించాడు. చాణక్య నీతి పుస్తకంలోని అంశాలు నేటికీ అనుసరణీయమని పెద్దల నమ్మకం. ఈరోజు చాణుక్యుడు తల్లిదండ్రులు పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని.. ముఖ్యంగా పిల్లల ముందు తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలో తెలియజేస్తూ కొన్ని అంశాలను సూచించాడు.
- భాష: పిల్లలకు తల్లిదండ్రులు మొదటి గురువులు. వారిని చూసి పిల్లలు అనేక విషయాలను నేర్చుకుంటారు. మీ పిల్లలు మర్యాదపూర్వకంగా, సంస్కారవంతులుగా ఉండాలని మీరు కోరుకుంటే, మొదట చేయవలసినది వారి భాషను మెరుగుపరచడం. అందుకని తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ పిలల్ల ముందు మాట్లాడే భాష సంస్కారవంతంగా ఉండాలని సూచించాడు. ఎందుకంటే.. తల్లిదండ్రులు పిల్లల ముందు తప్పుడు భాష మాట్లాడితే వారి పిల్లలు కూడా అదే పాటిస్తారు.
- అబద్దాలు చెప్పడం: చాలా సార్లు తల్లిదండ్రులు పిల్లల ముందు అబద్ధాలు చెబుతారు, లేదా పిల్లలను తమ స్వార్థం కోసం పిల్లలను అబద్ధాలు చెప్పేలా చేస్తారు. దీని వల్ల మీ పిల్లలు అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటారు. అది పిల్లలు పెరిగి పెద్ద అయ్యాక కూడా అలవాటు కొనసాగుతుంది.. అనేక కష్టాలు తెచ్చే అవకాశం కూడా ఉంది.
- పరస్పర గౌరవం కలిగి ఉండడం: పిల్లల ముందు ఎప్పుడూ ఒకరితో ఒకరు మర్యాదగా మాట్లాడుకోండి. అంతేకాదు తల్లిదండ్రులు ఒకరినొకరు గౌరవించకుంటూ ఉండాలి. అది తల్లిదండ్రుల నుంచి పిల్లలు నేర్చుకుంటారు. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లల ముందు ఒకరినొకరు కించపరుకునే విధంగా ప్రవర్తిస్తే.. భవిష్యత్తులో పిల్లలు తమ తల్లిదండ్రులను అవమానించడానికి కూడా వెనుకాడరు.
- పిల్లల ముందు తప్పులను ఎంచవద్దు: ఇంట్లో భార్య భర్తలు ఒకరి లోపాలను మరొకరు పిల్లల ముందు ప్రస్తావిస్తూ.. కించపరచుకోకండి.. అంతేకాదు ఇతరుల గురించి కూడా పిల్లల ముందు తప్పుగా మాట్లాడవద్దు. ఈ అలవాటు మీ పిల్లలకు ఇతరులలోని తప్పులను ఎప్పుడు ఎంచేలా చూస్తుంది. ఒకొక్కసారి పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యం తగ్గి, ఇతరులను కించపరిచేందుకు వెనుకాడరు.
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు , నమ్మకం ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
Also Read: