Viral Video: పిల్ల అయినా పులి పులే.. తల్లిని వణికించిన బుజ్జి పులి.. నవ్వులు పూయిస్తోన్న వీడియో..

Viral Video: చిన్న పిల్లలు చేసే పనులు ఎంత ఫన్నీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారు తెలిసి తెలియక చేసే పనులు నవ్వులు తెప్పిస్తాయి. అందుకే చిన్న పిల్లలతో కొంత సేపు గడిపితే చాలు బాధలన్నీ ఎగిరిపోవాల్సిందే. అయితే కొన్ని సందర్భాల్లో..

Viral Video: పిల్ల అయినా పులి పులే.. తల్లిని వణికించిన బుజ్జి పులి.. నవ్వులు పూయిస్తోన్న వీడియో..
Viral Video
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 18, 2022 | 2:44 PM

Viral Video: చిన్న పిల్లలు చేసే పనులు ఎంత ఫన్నీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారు తెలిసి తెలియక చేసే పనులు నవ్వులు తెప్పిస్తాయి. అందుకే చిన్న పిల్లలతో కొంత సేపు గడిపితే చాలు బాధలన్నీ ఎగిరిపోవాల్సిందే. అయితే కొన్ని సందర్భాల్లో వారి పనులు నవ్వు తెప్పించినా మరికొన్ని సందర్భాల్లో భయపెట్టిస్తుంటాయి కూడా. ఇది కేవలం మనుషులకే పరిమితమా అంటే కాదని చెబుతోంది నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో.

వివరాల్లోకి వెళితే.. ఓ జూలో తల్లి పులి (వైట్‌ టైగర్‌), బిడ్డ పులి ఉన్నాయి. ఆ సమయంలోనే తల్లి పులి ఆహారం కోసం వెతుకుతూ దాని పనిలో అది బిజీగా ఉంది. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న ఓ గదిలో ఉన్న బుజ్జి పులి పిల్ల బయటకు వచ్చింది. వచ్చింది వచ్చినట్లు సైలంట్‌గా ఉండకుండా గదిలో నుంచి ఒక్కసారిగా బయటకు దూకింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ తల్లి పులి గజ్జుమని వణికింది. ఏదో జంతువు తనపై దాడి చేయడానికి వచ్చిందని భావించి వెనక్కి తిరిగి చూసింది.

తీరా అక్కడ ఉంది తన బిడ్డే అని తెలిసి గమ్మున ఉంది. ఇదంతా అక్కడే ఉన్న ఓ కెమెరాలో రికార్డు కావడంతో ఆ వీడియోను నెట్టింట పోస్ట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. చిన్న పిల్ల అయితేనేం పులి పులే అంటూ కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Viral Video: సుందరానికి తొందరెక్కువ అంటే ఇదే.. వధువును చూసి కంట్రోల్ తప్పిన వరుడు.. చివరకు..

Viral Video: విద్యార్థిని ఢీకొట్టబోయిన కారు..అంతలోనే..! ప్రాణాలకు తెగించి రెస్క్యూ.! వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: విద్యార్థిని ఢీకొట్టబోయిన కారు..అంతలోనే..! ప్రాణాలకు తెగించి రెస్క్యూ.! వైరల్ అవుతున్న వీడియో..