Viral Video: సుందరానికి తొందరెక్కువ అంటే ఇదే.. వధువును చూసి కంట్రోల్ తప్పిన వరుడు.. చివరకు..

ఈ మద్యకాలంలో పెళ్లి వేడుకలు(wedding ceremony) సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఆ వేడుకల్లో జరిగే సరదా సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి. ఇలాంటి వీడియోలను చూసేందుకు..

Viral Video: సుందరానికి తొందరెక్కువ అంటే ఇదే.. వధువును చూసి కంట్రోల్ తప్పిన వరుడు.. చివరకు..
Desi Bride Gives Dancing
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 18, 2022 | 1:27 PM

ఈ మద్యకాలంలో పెళ్లి వేడుకలు(wedding ceremony) సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఆ వేడుకల్లో జరిగే సరదా సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి. ఇలాంటి వీడియోలను చూసేందుకు నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు. ఇంటర్నెట్‌లో ఇలాంటి కంటెంట్‌ని అప్‌లోడ్ చేసిన వెంటనే  వైరల్‌గా(viral video) మారుతున్నాయి. అయితే తాజాగా ఇవాళ ట్రెండ్ అవుతున్న ఈ వీడియోలో ఇందులో తొందరపడిన వరుడు తనను తాను ఆపుకోలేక పోయాడు. అందరి ముందు వధువును ఎత్తుకునేందుకు ప్రయత్నించాడు. సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో వరుడు ఆమె కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అయితే అక్కడికి డ్యాన్స్ చేస్తూ వధువు అక్కడి రావడం మనం ఈ వీడియోలో చూడవచ్చు. అదే సమయంలో  వరుడు ఎదురు వెళ్లాడు. అతను తనను తాను ఆపుకోలేక ఆమెతో డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు. వరుడు ఎంత ఉత్సాహంగా ఉన్నాడో వీడియోలో చూడవచ్చు. డ్యాన్స్ చేస్తూ అందరి ముందు పెళ్లికూతురును ప్రేమగా కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. అప్పుడు అతను ఒడిలో అతనిని ఎత్తబోతున్నాడు.. వధువు అతనిని సైగలలో తిరస్కరించింది.

ఈ అందమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెడ్డింగ్‌బ్రిడ్జ్ అఫీషియల్ అనే ఖాతాతో షేర్ చేయబడింది. జనవరి 25న అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 53 వేల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో దీనిపై పలువురు కామెంట్లు కూడా చేశారు.

ఇవి కూడా చదవండి: Petrol Diesel Price: రష్యా-ఉక్రెయిన్ రచ్చ కారణంగా పెరిగిన ముడి చమురు ధరలు.. మన దేశంలో మాత్రం పెట్రోల్-డీజిల్ ధరలు ఇలా..

CM Jagan: గుంటూరు జిల్లాలో ఇస్కాన్ అక్షయపాత్ర.. ప్రారంభించనున్న సీఎం జగన్..