AP CM Jagan: ఈ నెల 20వ తేదీన వైఎస్సార్ కడప, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్న సీఎం జగన్
AP CM Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 20వ తేదీన వైఎస్సార్ కడప జిల్లా(YSR Kadapa District), విశాఖపట్నం(visakha) జిల్లాల్లో పర్యటించనున్నారు..
AP CM Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 20వ తేదీన వైఎస్సార్ కడప జిల్లా(YSR Kadapa District), విశాఖపట్నం(visakha) జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా కడప జిల్లాలో పర్యటించి అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం జగన్ తాడేపల్లిలో తన స్వగృహం నుంచి బయలు దేరి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలు దేరి.. ఉదయం 11 గంటలకు కడప చేరుకోనున్నారు. అనంతరం పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి కడప రింగ్ రోడ్ జయరాజ్ గార్డెన్స్‌లో డిప్యూటీ సీఎం ఎస్‌బి.అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి తిరిగి చేరుకోనున్నారు.
అదేరోజు సాయంత్రం సీఎం జగన్ గన్నవరం నుంచి బయలు దేరి.. సాయంత్రం 4.45 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడ నుంచి ముఖ్యమంత్రి నేవల్ ఎయిర్‌స్టేషన్, ఐఎన్‌ఎస్ డేగా వద్దకు చేరుకొని.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలుకానున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు
Also Read: