Breaking: యూపీఎస్సీ సివిల్‌ సర్వీస్‌ 2022 పోస్టులు పెరిగాయోచ్‌! మొత్తం 1011 పోస్టులకు..

యూపీఎస్సీ నోటిఫికేషన్‌లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ లతోసహా విధ సివిల్‌ సర్వీసులకు సంబంధించి మొత్తం 861 ఖాళీలున్నట్టు తెలియజేసింది. ఐతే తాజా నోటిఫికేషన్‌ ద్వారా ఈ పోస్టులను పెంచినట్లు యూపీఎస్సీ (UPSC) పేర్కొంది..

Breaking: యూపీఎస్సీ సివిల్‌ సర్వీస్‌ 2022 పోస్టులు పెరిగాయోచ్‌! మొత్తం 1011 పోస్టులకు..
Upsc 2022
Follow us

|

Updated on: Feb 19, 2022 | 7:26 AM

UPSC Civil Services Vacancies Increased: యూపీఎస్సీ సివిల్‌ సర్వీస్‌ నోటిఫికేషన్‌ 2022 ఈ నెల (ఫిబ్రవరి)2న విడుదలైన సంగతి తెలిసిందే. ఐతే ఈ నోటిఫికేషన్‌లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ లతోసహా విధ సివిల్‌ సర్వీసులకు సంబంధించి మొత్తం 861 ఖాళీలున్నట్టు తెలియజేసింది. ఐతే తాజా నోటిఫికేషన్‌ ద్వారా ఈ పోస్టులను పెంచినట్లు యూపీఎస్సీ (UPSC) పేర్కొంది. ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (IRMS)కు సంబంధించి గ్రూప్ ‘A’ లోని 150 పోస్టులను యూపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 1011కు పెరిగింది. అదనపు పోస్టులకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో చూడొచ్చు.

తాజా నోటిఫికేషన్ ప్రకారం.. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2022 ద్వారా ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (IRMS), గ్రూప్ ‘A’లో 150 మంది సిబ్బందిని రిక్రూట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా సివిల్ సర్వీస్‌లలో ఐఆర్‌ఎంఎస్‌ను చేర్చడాన్ని కేంద్రం 2019లో నిరాకరించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష (engineering services exam) నిర్వహించి, ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా రైల్వే మంత్రిత్వ శాఖలోని అన్ని స్థాయిల్లో అంటే జూనియర్ స్కేల్ నుంచి HAG+ వరకున్న 8 సర్వీసులను ఏకీకృతం చేస్తున్నట్లు 2019 డిసెంబర్‌లో ప్రకటించింది కూడా. ఈ విధమైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంతవరకు ఐఆర్‌ఎమ్‌ఎస్‌ నియామకాలు చేపట్టలేదు. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ ఏడాది యూపీఎస్సీ ద్వారా 150 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

IRMS అంటే ఏమిటి? దేశంలోని 8 వేర్వేరు నేషనల్ ట్రాన్స్‌పోర్టర్ సర్వీస్‌లను విలీనం చేసినట్లు భారతీయ రైల్వే ఇటీవల నోటీసు జారీ చేసింది. ఈ ట్రాన్స్‌పోర్టర్‌లన్నింటినీ కలిపి ఐఆర్‌ఎంఎస్‌ను రూపొందించారు. దీని పూర్తి పేరు ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్.

IRMS గ్రూప్ A ఉద్యోగం: IRMS గ్రూప్ A ఖాళీ ఈ ఏడాది ఐఆర్‌ఎంఎస్‌లోని గ్రూప్‌ ఎ పోస్టులను యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్ష ద్వారా రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఈ విభాగంలో 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 6 పోస్టులు దివ్యాంగుల కేటగిరీకి రిజర్వ్ చేయబడతాయి.

అర్హతలేమిటి? యూపీఎస్సీ తాజా సమాచారం ప్రకారం.. ఐఆర్‌ఎమ్‌ఎస్‌ గ్రూప్ ‘ఏ’ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కూడా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 నోటిఫికేషన్‌లో సూచించిన అర్హతలు వర్తిస్తాయి. అంతేకాకుండా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవల్సిన అవసరం లేదు. యూపీఎస్సీ అన్ని సర్వీసుల్లో భాగంగా ఐఆర్‌ఎమ్‌ఎస్‌లను కూడా భర్తీ చేస్తారన్నమాట.

Also Read:

IRCON Recruitment 2022: రూ. లక్షకు పైగా జీతంతో ఇర్కాన్‌లో 40 అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..