Hiring trends 2021: జోరు మీదున్న ఐటీ రంగం.. గతేడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా మూడు రెట్లు పెరగనున్న నియామకాలు..

Hiring trends 2021: ఐటీ రంగానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఈ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ...

Hiring trends 2021: జోరు మీదున్న ఐటీ రంగం.. గతేడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా మూడు రెట్లు పెరగనున్న నియామకాలు..
Follow us

|

Updated on: Sep 07, 2021 | 7:24 PM

Hiring trends 2021: ఐటీ రంగానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఈ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ సమయంలో అరంకెల జీతం అందుకునే అవకాశమున్న ఏకైక రంగం కావడంతో యువత కూడా ఐటీ సంబంధిత ఉద్యోగాలవైపు మొగ్గుచూపుతుంటారు. అయితే కరోనా మహామ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపినట్లే ఐటీ రంగంపై కూడా ప్రభావాన్ని చూపింది. కరోనా కారణంగా ఐటీ రంగంలో ఉద్యోగాల నియామకాలు కాస్త నెమ్మదించాయి. అయితే తాజాగా పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉద్యోగ నియామకాలు పెరిగినట్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ రంగంలో ఎలాంటి మార్పులు రానున్నాయి, రానున్న రోజుల్లో ఉద్యోగాల నియామక సరళి ఎలా ఉండనుందన్న పూర్తి విశేషాలు ఓసారి చూద్దాం..

ముఖ్యంగా ఐటీ రంగాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు..

1) ఐటీ సంబంధిత సేవలు అందించేవి ఉదాహరణకు ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఐబీఎమ్‌. 2) డెవలప్‌మెంట్‌ రంగానికి చెందిన అంతర్జాతీయ సంస్థలు ఉదాహరణకు జేపీ మోర్గాన్‌, వీఎమ్‌ వేర్, వాల్‌మార్ట్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అబోడ్‌ వంటి సంస్థలు. 3) ఫ్లిప్‌కార్ట్‌, కార్టాలేన్‌ వంటి భారత్‌కు చెందిన స్టార్టప్‌ కంపెనీలు మూడో జాబితాలోకి వస్తాయి.

ఈ మూడు విభాగాల్లో కలిపి 2020 నాటికి దేశ వ్యాప్తంగా సుమారు 40 లక్షలకుపైగా ఉద్యోగులున్నారు. 2015 నుంచి ఏటా కొత్తగా 1.25 లక్షల నుంచి 1.5 లక్షల మంది కొత్త ఉద్యోగులు వస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ మూడు రంగాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటున్నాయో ఇప్పుడు చూద్దాం..

ఐటీ సేవలు..

2020 నాటికి ఐటీ సేవల రంగంలో దాదాపు 30 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఇన్‌ఫోసిస్‌, టీసీఎస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ వంటి కంపెనీల నుంచి సేకరించిన డేటా ఆధారంగా.. 2021-22 తొలి క్వార్టర్‌లో నియమించుకున్న ఉద్యోగుల సంఖ్య 2018-19తో పోలిస్తే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇదిలాగే కొనసాగితే ఈ ఏడాది చివరి నాటికి 2 లక్షల కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. ఇక గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐటీ రంగంలో ఉద్యోగాల నియామకం మూడు రెట్లు పెరగనున్నట్లు తెలుస్తోంది. రానున్న 12 నెలల్లో 84,000 కొత్త ఉద్యోగాలు రానున్నాయి.

టెక్‌ సెంటర్లు.. (ఇతర దేశాల కంపెనీలు)

ఇతర దేశాలకు చెందిన ఐటీ కంపెనీలు భారత్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్‌ నోయిడాలో కొత్త సెంటర్‌ను ఓపెన్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలోనే ఇలాంటి కొత్త కంపెనీలు 100కిపైగా రానున్నట్లు అంచనా. కాబట్టి ఇందులో కూడా ఉద్యోగాలు పెరగనున్నాయి.

స్టార్టప్‌ కంపెనీలు..

భారత్‌లో స్టార్టప్‌ కంపెనీల జోరు కొనసాగుతోంది. ఆగస్టు నాటికి సుమారు 21 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల పెట్టుబడులు ఈ రంగంలోకి వచ్చాయి. ఫిబ్రవరి 2021లో సుమారు 1.75 లక్షల మందికి స్టార్టప్‌ కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయని లెక్కలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో స్టార్టప్‌లకు పెట్టుబడులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఉద్యోగాలు సైతం పెరిగే అవకాశాలున్నాయి.

డిజిటలైజేషన్‌ పెరుగుతోంది..

టెక్‌ కంపెనీలు డిజిటలైజేషన్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఫార్మా, మ్యానిఫాక్షరింగ్‌, ఇలా ఏ రంగం చూసుకున్నా టెక్నాలజీ వినియోగం అనివార్యంగా మారుతోంది. ఈ కారణంగా కంపెనీలు డిజిటలైజేషన్‌ను ఉపయోగించుకోవడం అనివార్యంగా మారుతోంది. చిన్న చిన్న కంపెనీలకు కూడా టెకీలు అవసరం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ బట్టి చూస్తే 2021-2022 నాటికి కనీసం 6 నుంచి 7 లక్షల కొత్త ఉద్యోగాలు ఈ రంగంలో రానున్నాయి.

Also Read: Tamil Nadu: నిత్యానంద శిష్యులను తరిమికొట్టిన రాశిపురం గ్రామస్థులు.. ఇంతకీ వాళ్లు ఏం చేశారంటే..?

Indian Railways: ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు..ఏసీ 3 టైర్ ఎకానమీ క్లాస్ కోచ్ సౌకర్యం ప్రారంభం

Baby Shower: మహిళా కానిస్టేబుల్‌కు అరుదైన గౌరవం.. సహచరుల సమక్షంలో పోలీస్ స్టేషన్‌లో సీమంతం