ITBP Recruitment: ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. రూ. 2 లక్షలకు పైగా జీతం పొందే అవకాశం..
ITBP Recruitment 2021: ఇండో టిటెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ దేశీల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో 553 పోస్టులను...
ITBP Recruitment 2021: ఇండో టిటెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ దేశీల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో 553 పోస్టులను భర్తీ చేయనున్నారు. పురుషులతో పాటు మహిళలకు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఉద్యోగాల నియామకానికి సంబంధించిన పూరత్ఇ వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 553 ఖాళీలను భర్తీచేయనున్నారు. * వీటిలో సూపర్ స్పెషలిస్ట్ (05), స్పెషలిస్ట్ (01), మెడికల్ ఆఫీసర్లు (345), డెంటల్ (02) పోస్టులను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో స్పెషలైజేషన్‌లో క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఎంసీఐ/ఎన్‌ఎంసీ/స్టేట్ మెడికల్ కౌన్సిల్/డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి గుర్తింపు పొందాలి.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * సూపర్ స్పెషలిస్ట్ పోస్టులకు ఎంపికైన వారికి రూ. 78,800 నుంచి రూ. 2,09200 వరకు చెల్లిస్తారు. * స్పెషలిస్ట్ పోస్టులకు ఎంపికైన వారికి రూ. 67,700 నుంచి రూ. 1,77,500 వరకు చెల్లిస్తారు. * మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన వారికి రూ. 56,100 నుంచి రూ. 1,77,500 వరకు చెల్లిస్తారు. * డెంటల్ సర్జన్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 56,100 నుంచి రూ. 1,77,500 వరకు చెల్లిస్తారు. * దరఖాస్తుల ప్రక్రియ 13-09-2021 నుంచి ప్రారంభమవుతుండగా 27-10-2021తో ముగియనుంది. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
JEE Main 2021 Answer Key: జేఈఈ మెయిన్ ఎగ్జామ్ ఆన్సర్ కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..