5

ECIL Recruitment 2021: హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో అప్రెంటీస్ పోస్టులు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.

ECIL Recruitment 2021: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (ECIL) ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా...

ECIL Recruitment 2021: హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో అప్రెంటీస్ పోస్టులు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
Follow us

|

Updated on: Sep 07, 2021 | 6:41 PM

ECIL Recruitment 2021: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (ECIL) ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 243 పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 243 ఖాళీలకు గాను ఎలక్ట్రిషియన్‌ (30), ఎలక్ట్రానిక్‌ మెకానిక్స్‌ (70), ఫిట్టర్‌ (65), ఆర్‌ అండ్‌ ఏసీ (07), ఎమ్‌ఎమ్‌వీ (01), టర్నర్‌ (10), మెషనిస్ట్‌ (05), మెషనిస్ట్‌ (జీ) – 03, ఎమ్‌ఎమ్‌ టూల్‌ మెంట్‌ (02), కార్పెంటర్‌ (05), కొపా (16), డీజిల్‌ మెకానిక్‌ (05), ప్లంబర్‌ (02), ఎస్‌ఎమ్‌డబ్ల్యూ (02), వెల్డర్ (15), పెయింటర్ (05) ఖాళీలను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐటీఐ ఉత్తీర్ణత సర్టిఫికేట్‌తో పాటు, సంబంధిత ట్రేడ్‌లో ఎన్‌సీవీటీ సర్టిఫికేట్‌ పొంది ఉండాలి. * అభ్యర్థుల వయసు అక్టోబర్‌ 14, 2021 నాటికి 18 ఏళ్ల లోపు ఉండకూడదు. జనరల్ అభ్యర్థులు గరిష్టంగా 25 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులు 28 ఏళ్లు, ఎస్‌సీ/ఎస్టీ అభ్యర్థులు 30 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. మెరిట్‌ ఉన్న అభ్యర్థుల సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ చేసి తీసుకుంటారు. * డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ సెప్టెంబర్‌ 20 నుంచి 25 మధ్య నిర్వహిస్తారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Deepika Pilli: లంగా ఓణీలో తన అందాలు చూపిస్తూ ఫాన్స్ రెచ్చగొడుతున్న ఢీ బ్యూటీ దీపికా..

తెలంగాణ: స్కూల్స్‌లో ఫిజికల్ క్లాసులు.. మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

LPG Connection: కొత్తగా గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.? మిస్డ్ కాల్‌ ఇస్తే చాలు. ఇంటి వద్దకే సేవలు..