Baby Shower: మహిళా కానిస్టేబుల్‌కు అరుదైన గౌరవం.. సహచరుల సమక్షంలో పోలీస్ స్టేషన్‌లో సీమంతం

Venkata Narayana

Venkata Narayana |

Updated on: Sep 07, 2021 | 6:50 PM

గురజాల మహిళా కానిస్టేబుల్‌కు అరుదైన గౌరవం దక్కింది. సీఐ ఆధ్వర్యంలో స్టేషన్లోనే సీమంతం కార్యక్రమం జరిగింది. గురజాల టౌన్

Baby Shower: మహిళా కానిస్టేబుల్‌కు అరుదైన గౌరవం.. సహచరుల సమక్షంలో పోలీస్ స్టేషన్‌లో సీమంతం
Gurajala Woman Constable Ba

Woman Constable: గురజాల మహిళా కానిస్టేబుల్‌కు అరుదైన గౌరవం దక్కింది. సీఐ ఆధ్వర్యంలో స్టేషన్లోనే సీమంతం కార్యక్రమం జరిగింది. గురజాల టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బంగారమ్మ అనే మహిళకు ఈ అవకాశం లభించింది. బంగారమ్మ గురజాల పోలీస్ స్టేషన్‌లో మూడు సంవత్సరాలుగా పనిచేస్తోంది.

మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తోట బంగారమ్మ విధి నిర్వహణలో సమర్థురాలుగా తోటి సిబ్బంది మన్ననలు పొందింది. ఈ నేపథ్యంలో తొలిసారి గర్భవతిగా ఉన్న మహిళా కానిస్టేబుల్‌ను తగురీతిగా సన్మానించాలని సిబ్బంది భావించారు. గురజాల పట్టణ సి ఐ సురేంద్ర బాబు ఆధ్వర్యంలో ఘనంగా సీమంతం వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల డియస్పి మెహర్ జయరాం ప్రసాద్ పాల్గొన్ని మహిళా పోలీసుకి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. తనకు ఇంతటి గౌరవం దక్కడం నా పూర్వజన్మ సుకృతం అన్నారు బంగారమ్మ. ఇంతటి సన్మానం నిర్వహించిన సిబ్బందికి రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో యస్ ఐ నాగార్జున, ఎయస్ఐ స్టాలిన్, గురజాల పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Read also: Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు, నలుగురి బ్యాంక్ ఖాతాల నుండి విదేశాలకు భారీగా డబ్బు..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu