Indian Coast Guard Jobs: టెన్త్/ఇంటర్ అర్హతతో.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 322 నావిక్, యాత్రిక్ ఉద్యోగాలు.. రూ.రెండున్నర లక్షల జీతం..
భారత త్రివిద దళాలకు సంబంధించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard).. 322 నావిక్, యాత్రిక్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..
Indian Coast Guard (ICG) Navik and Yantrik Recruitment 2022: భారత త్రివిద దళాలకు సంబంధించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard).. 322 నావిక్, యాత్రిక్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. లెఫ్టినెంట్, కెప్టెన్, లెఫ్టినెంట్ కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీచేయనున్నారు. పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి, మ్యాథ్య్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్, ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/టెలీకమ్యునికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైన దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు 18 నుంచి 22 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 22, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో అప్లికేషన్ ఫీజుగా జనరల్ అభ్యర్ధులు రూ.250లు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెట్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.56,100ల నుంచి రూ.2,50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఖాళీల వివరాలు:
- నావిక్ (GD) పోస్టులు – 225
- నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టులు – 40
- యాంత్రిక్ (మెకానికల్) పోస్టులు – 16
- యాంట్రిక్ (ఎలక్ట్రికల్) పోస్టులు – 10
- యాంట్రిక్ (ఎలక్ట్రానిక్స్) పోస్టులు – 09
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 8, 2022.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 22, 2022.
- స్టేజ్-1 రాత పరీక్ష తేదీ: నవంబర్ ప్రారంభంలో/చివరిలో, 2022.
- స్టేజ్-2 రాత పరీక్ష తేదీ: జనవరి ప్రారంభంలో/చివరిలో, 2023.
- స్టేజ్-3 రాత పరీక్ష తేదీ: ఏప్రిల్ చివరిలో లేదా మే ప్రారంభంలో, 2023.
- అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ తేదీ: పరీక్షకు 2, 3 రోజుల ముందు.
ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.