Indian Army TES 48: ఇండియన్‌ ఆర్మీ టెక్నికల్‌10+2 ఎంట్రీ స్కీమ్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. ఖాళీలు, జీతభత్యాల వివరాలు ఇవే..

ఇండియన్‌ ఆర్మీలో 2023 సంవత్సరానికిగానూ టెక్నికల్‌10+2 ఎంట్రీ స్కీమ్‌ కింద (Indian Army).. 90 పోస్టుల్లో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష అభ్యర్ధుల నుంచి..

Indian Army TES 48: ఇండియన్‌ ఆర్మీ టెక్నికల్‌10+2 ఎంట్రీ స్కీమ్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. ఖాళీలు, జీతభత్యాల వివరాలు ఇవే..
Indian Army
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 26, 2022 | 6:53 AM

Indian Army 10+2 TES 48 Recruitment Notification 2022: ఇండియన్‌ ఆర్మీలో 2023 సంవత్సరానికిగానూ టెక్నికల్‌10+2 ఎంట్రీ స్కీమ్‌ కింద (Indian Army).. 90 పోస్టుల్లో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. లెఫ్టినెంట్, కెప్టెన్, లెఫ్టినెంట్ కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీచేయనున్నారు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా జులై 2, 2003 ముందు జులై 1, 2006 తర్వాత జన్మించి ఉండకూడదు. అంటే అభ్యర్ధుల వయసు 16 నుంచి19 యేళ్లకు మించకుండా ఉండాలి. విద్యార్హతలేమి ఉండాలంటే.. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియల్‌ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధులు తప్పనిసరిగా జేఈఈ (మెయిన్‌) 2022 పరీక్ష రాసి ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 21, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జాం ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.56,100ల నుంచి రూ.2,50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.