Indian Army SSC Recruitment 2021: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి అవకాశం..
Indian Army SSC Recruitment 2021: ఇండియన్ ఆర్మీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా షార్ట్ సర్వీస్ కమిషన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పెళ్లి కానీ యువతీ యువకులతో పాటు...
Indian Army SSC Recruitment 2021: ఇండియన్ ఆర్మీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా షార్ట్ సర్వీస్ కమిషన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పెళ్లి కానీ యువతీ యువకులతో పాటు వితంతువులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
భర్తీ చేయనున్న పోస్టులు, అర్హతలు..
* 57వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) మెన్, 28వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) వుమెన్ ఉద్యోగులను భర్తీ చేయనున్నారు.
* ఇందులో భాగంగా పురుషులు (175), మహిళలు (14), వింతువులు (2) పోస్టులను రిక్రూట్ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతోన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
* అభ్యర్థులు 2021 అక్టోబర్ 1 లోపు ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఈ పోస్టులకు దరఖాస్తులు మే 25న ప్రారంభం కాగా.. జూన్ 23ను చివరి తేదీగా నిర్ణయించారు.
* అభ్యర్థుల వయసు 20 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
* ఎంపికైన అభ్యర్థులకు తమిళనాడు రాజధాని చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఇస్తారు.
* పూర్తి వివరాలకు http://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Also Read: Duplicate Arrest : వాహనానికి ‘పోలీస్’ అనే స్టిక్కర్ అంటించుకుని మద్యం తరలిస్తోన్న డూప్లికేటు అరెస్ట్
ఇండియాలో కోవిద్ మరణాలపై ‘చెత్త వార్తలు’…, న్యూయార్క్ టైమ్స్ పై కేంద్రం నిప్పులు