NMDC Recruitment 2021: హైదరాబాద్ ఎన్ఎండీసీలో అంప్రెటిస్ ఖాళీలు.. మార్కుల ఆధారంగా ఎంపిక..
NMDC Recruitment 2021: హైదరాబాద్‌లోని మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషనల్ లిమిటెడ్ (ఎన్ఎండీసీ) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన...
NMDC Recruitment 2021: హైదరాబాద్‌లోని మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషనల్ లిమిటెడ్ (ఎన్ఎండీసీ) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ స్థానాలను భర్తీచేయనున్నారు.
మొత్తం ఖాళీలు, అర్హతలు..
* ఇందులో భాగంగా మొత్తం 59 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–16, టెక్నీషియన్ అప్రెంటిస్–13,ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్(పాసా)–30.
* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు దరఖాస్తు చేసుకునే వారు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్–ఎలక్ట్రానిక్స్, మైనింగ్ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఎంపికై వారికి నెలకు రూ.20,000 వేతనంగా చెల్లిస్తారు.
* టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకునే వారు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్–టెలీకమ్యూనికేషన్, మైనింగ్, మోడర్న్ ఆఫీస్ ప్రాక్టీస్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులకు నెలకు రూ.20,000 చెల్లిస్తారు.
* ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్(పాసా) పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు.. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(కోపా)లో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రెయినింగ్(ఎన్‌సీవీటీ) జారీచేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. వీరికి జీతంగా నెలకు రూ.10,000 అందిస్తారు.
ముఖ్యమైన విషయాలు..
* ఈ పోస్టుల ఎంపికను ఇంజనీరింగ్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిప్లొమా, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా నిర్వహిస్తారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలతో ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు తమ వివరాలను bld5hrd@nmdc.co.in మెయిల్‌కు పంపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తులకు చివరి తేదీగా 15.06.2021 నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Duplicate Arrest : వాహనానికి ‘పోలీస్’ అనే స్టిక్కర్ అంటించుకుని మద్యం తరలిస్తోన్న డూప్లికేటు అరెస్ట్
ఒడిశాలో పుట్టిన బిడ్డలకు ఇప్పుడు ఆ పేరు ట్రెండింగ్…ఏం పేరో తెలుసా?