AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTPC EET Recruitment 2021: ఎన్టీపీసీలో ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. గేట్‌-2021 స్కోర్ ఆధారంగా ఎంపిక‌..

NTPC EET Recruitment 2021: భార‌త ప్ర‌భుత్త రంగ సంస్థ నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. మ‌హారత్న కంపెనీ అయిన...

NTPC EET Recruitment 2021: ఎన్టీపీసీలో ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. గేట్‌-2021 స్కోర్ ఆధారంగా ఎంపిక‌..
Ntpc Jobs
Narender Vaitla
|

Updated on: May 27, 2021 | 9:51 PM

Share

NTPC EET Recruitment 2021: భార‌త ప్ర‌భుత్త రంగ సంస్థ నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. మ‌హారత్న కంపెనీ అయిన ఈ సంస్థ‌లో ఇంజ‌నీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (ఈఈటీ) పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* ప‌లు విభాగాల్లో మొత్తం 280 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్ విభాగాల్లో ఉద్యోగుల‌ను రిక్రూట్ చేసుకోనున్నారు.

* పోస్టుల‌కు ధ‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు 65 శాతం మార్కులకు తగ్గకుండా సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైం బ్యాచిలర్స్‌ డిగ్రీ ఇన్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులవ్వాలి. * చివరి ఏడాది/సెమిస్టర్ చ‌దువుతోన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యాలిడ్‌ గేట్‌–2021 స్కోర్‌ ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థుల వ‌య‌సు 27 ఏళ్లు మించ‌కూడ‌దు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

* గేట్‌-2021లో వ‌చ్చ‌ని మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్య‌ర్థులు దేశంలోని ఎన్‌టీపీసీ యూనిట్ల‌లో ఎక్క‌డైనా ప‌నిచేయాల్సి ఉంటుంది.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీగా 10-06-2021ని నిర్ణ‌యంచారు.

* పూర్తి వివ‌రాల‌కు www.ntpc.co.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Also Read: భారతీయ చట్టాలను మీరు గౌరవించి పాటించాల్సిందే ! ట్విటర్ కి కేంద్రం గట్టి హెచ్చరిక

JUDA’s: సమ్మె విరమించిన జూనియర్‌ డాక్టర్లు.. ప్రజా ఆరోగ్యం కోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడి

Hyderabad Mayor: హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మేయర్ విజయ లక్ష్మి.. పారిశుద్ధ్యం, నాళాలు పరిశీలన..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి